UGC NET Result 2024 : యూజీసీ నెట్ ఫలితాాలను చెక్ చేసుకున్నారా?
18 October 2024, 9:51 IST
- UGC NET Result 2024 : యూజీసీ నెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఎన్టీఏ యూజీసీ నెట్ జూన్ ఫలితాలను చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
యూజీసీ నెట్ జూన్ 2024 ఫలితాలు విడుదల..
యూజీసీ నెట్ 2024 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తాజాగా విడుదల చేసింది. యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కి హాజరైన అభ్యర్థులు ugcnet.nta.ac.in యూజీసీ నెట్ అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. యూజీసీ నెట్ ఫలితాలను ugcnet.ntaonline.in, nta.ac.in వంటి సైట్స్‌లో కూడా కూడా తెలుసుకోవచ్చు.
యూజీసీ నెట్ 2024 జూన్ ఫలితాలు విడుదల..
యూజీసీ నెట్ జూన్ పరీక్షకు మొత్తం 11,21225 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా 6,84,224 మంది మాత్రమే హాజరయ్యారు. మొత్తం 4970 మంది అభ్యర్థులు జేఆర్ఎఫ్కు, 53694 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు, 1,12,070 మంది పీహెచ్‌డీకి అర్హత సాధించారు.
యూజీసీ నెట్ ఫైనల్ ఆన్సర్ కీని 2024 అక్టోబర్ 12న విడుదల చేశారు. సెప్టెంబర్‌లో ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేయగా, అభ్యంతర విండోను 2024 సెప్టెంబర్ 14 వరకు తెరిచి ఉంచారు.
యూజీసీ నెట్ జూన్ పరీక్షను ఆగస్టు 21, 22, 23, 27, 28, 29, 30, సెప్టెంబర్ 2, 3, 4, 5 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే. షిఫ్ట్ 1 ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, షిఫ్ట్ 2 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహించారు.
యూజీసీ నెట్ పరీక్ష ఫలితాలను చెక్ చేసుకోవడానికి, స్కోర్‌కార్డులను డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని లాగిన్ క్రెడెన్షియల్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది.
యూజీసీ నెట్ రిజల్ట్ 2024 చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
యూజీసీ నెట్ ఫలితాల్ని ఇలా చెక్ చేసుకోండి..
పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ ఈ కింద చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
- ugcnet.nta.ac.in యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
- హోమ్ పేజీలో ఉన్న యూజీసీ నెట్ రిజల్ట్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
- అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- సబ్మిట్పై క్లిక్ చేస్తే మీ రిజల్ట్ డిస్ప్లే అవుతుంది.
- రిజల్ట్ చెక్ చేసుకుని పేజీని డౌన్లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసిపెట్టుకోండి.
ఫలితాలతో పాటు కటాఫ్ వివరాలను కూడా ఎన్టీఏ విడుదల చేసింది.
యూజీసీ-నెట్ అనేది భారతీయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 'జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, పీహెచ్‌డీలో ప్రవేశం కోసం భారతీయ పౌరుల అర్హతను నిర్ణయించే పరీక్ష.
యూజీసీ నెట్ అధారిక నోటీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
యూజీసీ నెట్ జూన్ 2024 కటాఫ్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.