UGC NET Notification : యూజీసీ నెట్ 2024 డిసెంబర్.. త్వరలోనే నోటిఫికేషన్!
19 November 2024, 11:15 IST
- UGC NET December 2024 notification : యూజీసీ నెట్ డిసెంబర్ 2024 నోటిఫికేషన్ త్వరలోనే విడుదలవుతుంది. అప్లికేషన్ ఫీజు, వయస్సు అర్హత వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
త్వరలోనే యూజీసీ నెట్ 2024 డిసెంబర్ నోటిఫికేషన్
యూజీసీ నెట్ 2024 డిసెంబర్ నోటిఫికేషన్ త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. యూజీసీ నెట్ 2024 డిసెంబర్ నోటిఫికేషన్, పరీక్ష తేదీలు వంటి వివరాలను అభ్యర్థులు యూజీసీ అధికారిక వెబ్సైట్ ugcnet.nta.ac.in లో తెలుసుకోవచ్చు. డిసెంబర్ నుంచి ఈ పరీక్షకు అదనపు సబ్జెక్ట్‌గా “ఆయుర్వేద జీవశాస్త్రం” కూడా ఉండనుంది. వివరణాత్మక సిలబస్ సంబంధిత అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది.
విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థుల అర్హతను నిర్ణయించడానికి యూజీసీ నెట్ రెండు సెషన్లలో నిర్వహించడం జరుగుతుంది.
యూజీసీ నెట్ 2024 డిసెంబర్ నోటిఫికేషన్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
UGC NET 2024 డిసెంబర్ నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు ఈ స్టెప్స్‌ని ఫాలో అవ్వొచ్చు..
స్టెప్ 1:- అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి; ugcnet.nta.ac.in
స్టెప్ 2:- యూజీసీ నెట్ డిసెంబర్ సెషన్ నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి
స్టెప్ 3:- నోటిఫికేషన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
స్టెప్ 4:- యూజీసీ నెట్ డిసెంబర్ నోటిఫికేషన్ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసి, తర్వాత ఉపయోగం కోసం సేవ్ చేసుకోండి.
అప్లికేషన్ ఫీజు..
యూజీసీ నెట్ పరీక్ష కోసం దరఖాస్తు రుసుము కేటగిరీ, హాజరయ్యే పేపర్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.
- జనరల్- రూ. 1150
- ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్- రూ. 600
- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ట్రాన్స్‌జెండర్- రూ. 375
వయస్సు..
ఏ) జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం గరిష్టంగా జనవరి 1 నాటికి 31 సంవత్సరాలు ఉండాలి. అయితే, భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో కొన్ని సడలింపులు ఉంటాయి.
బీ) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి లేదు.
అయితే యూజీసీ నెట్ పరీక్షకు వయోపరిమితి ఎప్పటికప్పుడు మారవచ్చని గమనించడం ముఖ్యం. ఖచ్చితమైన వయోపరిమితి, ఇతర అర్హత ప్రమాణాలను తెలుసుకోవడానికి అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసే అధికారిక యూజీసీ నెట్ 2024 డిసెంబర్ నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది.
యూజీసీ నెట్ 2024 జూన్ పరీక్షకు 11,21,225 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా.. 6,84,224 మంది ఎగ్జామ్ రాశారు. పేపర్ లీక్ కారణంగా ఈసారి పరీక్ష ఆలస్యంగా జరిగింది. అనంతరం అక్టోబర్‌లో ఫలితాలు వెలువడ్డాయి.