తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ugc Net Answer Key : త్వరలో యూజీసీ నెట్​ ఆన్సర్​ కీ విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

UGC NET Answer Key : త్వరలో యూజీసీ నెట్​ ఆన్సర్​ కీ విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu

Published Sep 07, 2024 02:00 PM IST

google News
    • UGC NET June 2024 Answer Key : యూజీసీ నెట్ జూన్ 2024 ఆన్సర్ కీ త్వరలో విడుదలవుతుందని సమాచారం. ఆన్సర్​ కీని ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలి? అన్న ప్రశ్నతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
త్వరలో యూజీసీ నెట్​ ఫలితాలు విడుదల.. (Karun Sharma/HT file)

త్వరలో యూజీసీ నెట్​ ఫలితాలు విడుదల..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) త్వరలో యూజీసీ నెట్ జూన్ 2024 ఆన్సర్ కీని విడుదల చేయనుంది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ugcnet.nta.ac.in యూజీసీ నెట్ అధికారిక వెబ్​సైట్ ద్వారా ఆన్సర్ కీని డౌన్​లోడ్ చేసుకోవచ్చు. ఈ వివరాలు nta.ac.in ఎన్టీఏ అధికారిక వెబ్​సైట్​లో అందుబాటులో ఉంటాయి.


ఎన్టీఏ యూజీసీ నెట్ పరీక్ష 2024 ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరిగిన విషయం తెలిసిందే. వరదల కారణంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో పరీక్షను రద్దు చేసి కొద్ది రోజుల్లోనే తిరిగి పరీక్ష నిర్వహించారు.

ప్రొవిజనల్ కీ విడుదల తేదీ- సమయాన్ని ఏజెన్సీ ఇంకా ప్రకటించలేదు. అధికారిక బ్రోచర్ ప్రకారం “ఎన్టీఏ అభ్యర్థి ప్రొవిజనల్ ఆన్సర్ కీ, ప్రశ్నపత్రాన్ని ఎన్టీఏ వెబ్​సైట్​లో https://ugcnet.nta.ac.in/ ప్రదర్శిస్తుంది. https://ugcnet.ntaonline.in. పరీక్ష తర్వాత కచ్చితమైన తేదీని ఎన్టీఏ వెబ్​సైట్​లో పొందుపరుస్తారు. ప్రొవిజనల్ ఆన్సర్ కీని రెండు, మూడు రోజుల పాటు ప్రదర్శించే అవకాశం ఉంది.”

ఆన్సర్ కీతో పాటు అభ్యంతర విండో కూడా ఓపెన్ అవుతుంది. ఆన్సర్ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకునే అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజుగా ఒక్కో ఆన్సర్ కీకి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు రీఫండ్ అవ్వదు.

సవాలు చేయగలిగే నిర్దిష్ట సమయానికి డబ్బులు చెల్లించిన అబ్జెక్షన్స్​ని మాత్రే పరిలిస్తారని గమనించాలి. జస్టిఫికేషన్/ఎవిడెన్స్ లేని సవాళ్లు/నిర్ణీత కాలవ్యవధి తర్వాత, నిర్దేశిత లింక్ కాకుండా మరే ఇతర మాధ్యమంలో దాఖలు చేసిన వాటిని పరిగణనలోకి తీసుకోరు.

అభ్యర్థులందరూ ప్రొవిజనల్ ఆన్సర్ కీని అధికారిక వెబ్​సైట్ నుంచి డౌన్​లోడ్​ చేసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.

ఇదీ చూడండి:- SSC GD Constable Exam : 39,481 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ..

యూజీసీ నెట్ జూన్ 2024 ఆన్సర్ కీ: ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలి?

  • ugcnet.nta.ac.in యూజీసీ నెట్ అధికారిక వెబ్​సైట్​ని సందర్శించండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న యూజీసీ నెట్ జూన్ 2024 ఆన్సర్ కీ లింక్పై క్లిక్ చేయండి.
  • అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • సబ్మిట్​ బటన్​పై క్లిక్ చేస్తే మీ ఆన్సర్ కీ కనిపిస్తుంది.
  • ఆన్సర్ కీ చెక్ చేసి పేజీని డౌన్​లోడ్​ చేసుకోవాలి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.

మరిన్ని వివరాలకు అభ్యర్థులు యూజీసీ నెట్ అధికారిక వెబ్​సైట్​ని చూడవచ్చు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.