SSC GD Constable Exam : 39,481 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ..-ssc gd constable exam 2025 registration begins for 39481 posts link here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ssc Gd Constable Exam : 39,481 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ..

SSC GD Constable Exam : 39,481 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ..

Sharath Chitturi HT Telugu
Sep 07, 2024 07:20 AM IST

SSC GD Constable notification : 39481 పోస్టుల భర్తీకి ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్​తో పాటు పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎస్​ఎస్సీ జీడీ కానిస్టేబుల్​ పరీక్ష రిజిస్ట్రేషన్​ షురూ
ఎస్​ఎస్సీ జీడీ కానిస్టేబుల్​ పరీక్ష రిజిస్ట్రేషన్​ షురూ

నిరుద్యోగులకు అలర్ట్​! భారీగా ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్​ని విడుదల చేసింది స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​ (ఎస్​ఎస్సీ). ఎస్​ఎస్సీ జీడీ కానిస్టేబుల్​ పరీక్ష 2025 కోసం రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. సెంట్రల్ ఆర్మ్​డ్​ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్​ ఎస్ఎస్ఎఫ్, రైఫిల్మన్ (జీడీ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్-2025లో సైనికుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ssc.gov.in ఎస్ఎస్సీ అధికారిక వెబ్​స్​టైలో డైరెక్ట్ లింక్​ని చూడవచ్చు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 అక్టోబర్ 14తో ముగుస్తుందని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఆన్​లైన్​ ఫీజు చెల్లింపులకు చివరితేదీ 15 అక్టోబర్ 2024. కరెక్షన్ విండో నవంబర్ 5న ప్రారంభమై 2024 నవంబర్ 7న ముగుస్తుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షను 2025 జనవరి-ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉంది. పరీక్ష తేదీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఎస్​ఎస్సీ జీడీ కానిస్టేబుల్​ పోస్టుల అప్లికేషన్​ కోసం డైరక్ట్​ లింక్​ పొందేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఖాళీల వివరాలు..

  • బీఎస్ఎఫ్: 15654 పోస్టులు
  • సీఐఎస్ఎఫ్: 7145 పోస్టులు
  • సీఆర్పీఎఫ్: 11541 పోస్టులు
  • ఎస్ఎస్బీ: 819 పోస్టులు
  • ఐటీబీపీ: 3017 పోస్టులు
  • ఏఆర్: 1248 పోస్టులు
  • ఎస్ఎస్ఎఫ్: 35 పోస్టులు
  • ఎన్సీబీ: 22 పోస్టులు
  • మొత్తం పోస్టులు- 39481

పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కటాఫ్ తేదీ, 01-01-2025 నాటికి గుర్తింపు పొందిన బోర్డు / విశ్వవిద్యాలయం నుంచి మెట్రిక్యులేషన్ లేదా 10 వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 01-01-2025 నాటికి 18-23 సంవత్సరాలు ఉండాలి (అంటే, 02-01-2002 కంటే ముందు- 01-01-2007 తర్వాత జన్మించిన అభ్యర్థులు). ఈ విషయాన్ని అభ్యర్థులు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.

ఇదీ చూడండి:- CBSE sample papers 2025 : సీబీఎస్​ఈ విద్యార్థులకు అలర్ట్​- క్లాస్​ 10, 12 శాంపిల్​ పేపర్స్​ విడుదల..

అప్లికేషన్​ ప్రక్రియ..

కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్​లో 80 ప్రశ్నలతో కూడిన ఒక ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఉంటుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.

కంప్యూటర్ ఆధారిత పరీక్షను ఇంగ్లిష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలైన (1) అస్సామీ, (2) బెంగాలీ, (3) గుజరాతీ, (4) కన్నడ, (వి) కొంకణి, (6) మలయాళం, (7) మణిపురి, (8) మరాఠీ, (9) ఒడియా, (x) పంజాబీ, (1) తమిళం, (xii) తెలుగు, (xiii) ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు..

రూ.100. రిజర్వేషన్ కు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్​మెన్ (ఈఎస్​ఎం) మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. భీమ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా వీసా, మాస్టర్ కార్డు, మాస్ట్రో, రూపే డెబిట్ కార్డుల ద్వారా ఆన్​లైన్​లో ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్​సైట్​ని చూడవచ్చు.

ఎస్​ఎస్సీ జీడీ కానిస్టేబుల్​ పరీక్షకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్​తో పాటు ఇతర కీలక వివరాల​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner