CBSE sample papers 2025 : సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్- క్లాస్ 10, 12 శాంపిల్ పేపర్స్ విడుదల..
CBSE sample paper 2024-25 : సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్! క్లాస్ 10, క్లాస్ 12కి సంబంధించిన శాంపిల్ పేపర్స్‌ని సీబీఎస్ఈ విడుదల చేసింది. పూర్తి వివరాలు, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
10, 12వ తరగతి శాంపిల్ (నమూనా) పేపర్లను విడుదల చేసింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ. ప్రస్తుత 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి 10, 12 తరగతుల నమూనా ప్రశ్నపత్రాలు cbseacademic.nic.in సీబీఎస్ఈ అకడమిక్ అధికారిక వెబ్సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి.
పాఠ్యప్రణాళిక ఏకరూపత (యూనిఫార్మిటీ), సరైన కవరేజీని నిర్ధారించడానికి ఒక మార్గదర్శిగా పనిచేయడానికి ఈ శాంపిల్ పేపర్లను బోర్డు ప్రతియేటా విడుదల చేస్తుంది. 10,12 తరగతుల కోసం నమూనా ప్రశ్నపత్రాలతో (ఎస్క్యూపీలు) పాటు మార్కింగ్ స్కీమ్స్ (ఎంఎస్) ని కూడా జారీ చేస్తుంది.
క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతోంది? అన్న విషయంపై అంచనా వేసేందుకు ఈ సీబీఎస్ఈ శాంపిల్ పేపర్లు విద్యార్థులకు ఉపయోగపడతాయి. క్లాస్‌రూమ్‌లో నేర్చుకున్న అంశాలను రియల్ లైఫ్‌లో అప్లై చేసేందుకు వీలును కల్పిస్తాయి.
10వ తరగతి నమూనా పేపర్లను డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీబీఎస్ ఈ 10, 12వ తరగతి నమూనా పేపర్లను డౌన్ లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీబీఎస్ ఈ 10, 12వ తరగతి నమూనా పేపర్లను డౌన్లోడ్ చేసుకోవడానికి విద్యార్థులు ఈ క్రింది సరళమైన దశలను అనుసరించవచ్చు..
- cbseacademic.nic.in వద్ద సీబీఎస్ఈ అకాడమిక్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న సీబీఎస్ఈ 10వ తరగతి, 12 శాంపిల్ పేపర్స్ 2025 లింక్‌పై క్లిక్ చేయండి.
- 10వ తరగతి, 12వ తరగతి నమూనా పేపర్ల లింకులను జత చేసిన చోట కొత్త పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది.
- ఆ లింక్స్‌పై క్లిక్ చేస్తే స్క్రీన్‌పై శాంపిల్ పేపర్ కనిపిస్తుంది.
- ఇప్పుడు మీరు శాంపిల్ పేపర్ చెక్ చేయాలనుకుంటున్న సబ్జెక్టుపై క్లిక్ చేయండి.
- ఇది పూర్తయిన తర్వాత, పేజీని డౌన్లోడ్ చేయండి. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసుపెట్టుకోండి.
ఇదిలా ఉండగా, 2025 సీబీఎస్ఈ క్లాస్ 10, 12 పరీక్షలకు అభ్యర్థుల జాబితా సమర్పణను ప్రారంభించింది. పరీక్షా సంఘం వెబ్సైట్లో 2024 సెప్టెంబర్ 5న డేటా సమర్పణ ప్రారంభమైంది. 2025లో 10, 12 వ తరగతి బోర్డు పరీక్షకు హాజరయ్యేందుకు విద్యార్థులను మాత్రమే అనుమతిస్తారు. వారి పేర్లను ఎల్ఓసీ సమర్పించే ఆన్లైన్ ప్రక్రియ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌ని చూడవచ్చు.
ఈ ఏడాది.. సీబీఎస్ఈ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి మొదలైన మార్చ్‌లో ముగిశాయి. అనంతరం సీబీఎస్ఈ క్లాస్ 10, సీబీఎస్ఈ క్లాస్ 12 పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత మే నెలలో ఫలితాలు వెలువడ్డాయి. వచ్చే ఏడాది సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్, ఫలితాలకు సంబంధించిన డేట్లను బోర్డు ఇంకా ప్రకటించలేదు. కొన్ని రోజుల తర్వాత వీటిపై ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్లో అందుబాటులో ఉంది. ఎడ్జ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకునేందుకు వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఇప్పుడే ఫాలో అవ్వండి.