CBSE Class 10 results : సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..-cbse class 10 results 2024 declared see how to check ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbse Class 10 Results : సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

CBSE Class 10 results : సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu
May 13, 2024 01:39 PM IST

CBSE Class 10 results : సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు విడుదలయ్యాయి. పూర్తి వివరాలతో పాటు ఫలితాలను ఎలా చెక్​ చేసుకోవాలో ఇక్కడ చూడండి..

సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు విడుదల..
సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు విడుదల.. (HT_PRINT)

CBSE Class 10 results 2024 : సీబీఎస్​ఈ క్లాస్​ 12 ఫలితాలను విడుదల చేసిన కొంతసేపటికే.. క్లాస్​ 10 ఫలితాలను విడుదల చేసింది.. సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకెండరీ ఎడ్జ్యుకేషన్. డిజీలాకర్​తో పాటు cbse.nic.in లో కూడా సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలను చెక్​ చేసుకోవచ్చు.

 ఈ ఏడాది.. 93.60శాతం మంది సీబీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షలు పాసైయ్యారు. గతేడాది ఇది 92.12శాతంగా ఉండేది. ఉత్తీర్ణులైన బాలికల శాతం 94.1, బాలురు 92.7శాతం, ట్రాన్స్​జెండర్​ 91.3శాతంగా ఉంది.

రాష్ట్రాల వారీగా సీబీఎస్​ఈ క్లాస్​ 10లో విద్యార్థుల ప్రదర్శన..

తిరువనంతపురం: 99.75%

విజయవాడ: 99.60%

చెన్నై: 99.30%

బెంగళూరు: 99.26%

అజ్మీర్​: 97.10%

సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు 2024 డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సీబీఎస్​ఈ ఫలితాలను ఇలా చెక్​ చేసుకోండి..

డిజీలాకర్​లో సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు ఎలా చెక్​ చేసుకోవాలో ఇక్కడ చూడండి..

స్టెప్​ 1:- డిజీలాకర్​ యాప్​ లేదా వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- అకౌంట్​ ఉంటే సైన్​-ఇన్​ చేసుకోండి. లేకపోతే అకౌంట్​ క్రియేట్​ చేసుకోండి.

CBSE 10 result 2024 date : స్టెప్​ 3:- హోం పేజ్​లోకి వెళ్లి.. సీబీఎస్​ఈ క్లాస్​ 10 రిజల్ట్స్​ లింక్​ కోసం చూడండి. దాని మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 4:- సంబంధిత వివరాలను సబ్మీట్​ చేయండి. స్కోర్​ డిస్​ప్లే అవుతుంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 15- మార్చ్​ 13 మధ్యలో సీబీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షలు జరిగాయి. 

కొంతసేపటి క్రితమే.. క్లాస్​ 12 ఫలితాలను సైతం విడుదల చేసింది సీబీఎస్​ఈ.

ఈ ఏడాది సీబీఎస్​ఈ క్లాస్​ 12 పరీక్షల కోసం 16,33,730 విద్యార్థులు రిజిస్టర్​ చేసుకున్నట్టు.. వీరిలో 16,21,224 మంది పరీక్షకు హాజరైనట్టు సీబీఎస్​ఈ తెలిపింది. ఇక పరీక్ష రాసిన వారిలో 14,26,420 మంది పాస్​ అయినట్టు పేర్కొంది. సీబీఎస్​ఈ క్లాస్​ 12 ఉత్తీర్ణత శాతం 87.9గా ఉంది. గతేడాది ఇది 87.33శాతంగా ఉండేది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point