ఆగస్టు 28, 29, 30 తేదీల్లో జరగనున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) 2024 అడ్మిట్ కార్డును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ ఎగ్జామ్ కు అప్లై చేసిన అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డును అధికారిక వెబ్సైట్ ugcnet.nta.ac.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు యూజీసీ - నెట్ జూన్ 2024 పరీక్ష అడ్మిట్ కార్డును ugcnet.nta.ac.in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని, అందులోని సూచనలను చదవాలని ఎన్టీఏ నోటిఫికేషన్ లో పేర్కొంది.
అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఉపయోగించి తమ అడ్మిట్ కార్డ్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రం చిరునామా, సూచనలు వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది.
ఎన్టీఏ యూజీసీ నెట్ 2024 (UGC NET) అడ్మిట్ కార్డులో ఈ కింది ముఖ్యమైన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ముందుగా చెక్ చేసుకోండి.
యూజీసీ నెట్ జూన్ 2024 కోసం అభ్యర్థులు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడంలో ఇబ్బంది లేదా పైన పేర్కొన్న వివరాలలో వ్యత్యాసం ఉంటే, వారు 011 - 407590000 నంబర్ కు ఫోన్ చేయవచ్చు. లేదా ugcnet@nta.ac.in కు ఈ-మెయిల్ చేయవచ్చు.