Google Maps : గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతూ ఆసుపత్రికి.. కారు వెళ్లింది మాత్రం నదిలోకి
30 June 2024, 16:15 IST
Google Maps Wrong Direction : గూగుల్ మ్యాప్స్ గురించి చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు. ఎందుకంటే కొన్నిసార్లు మనం పెట్టిన రూట్ ప్రకారం కాకుండా వేరే దారిలో తీసుకెళ్తుంది. అలాంటి ఘటనే కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులకు ఎదురైంది.
గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతూ నదిలోకి వెళ్లిన యువకులు
గూగుల్ మ్యాప్స్ సాయంతో ఆస్పత్రికి వెళ్తుండగా కాసరగోడ్‌లోని పల్లంచీ ఫారెస్ట్ రోడ్డుపై తెల్లవారుజామున కారు నదిలో పడిపోయింది. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న తమ వాహనం చెట్టుకు చిక్కుకోవడంతో వారు తప్పించుకుని అగ్నిమాపక సిబ్బందిని సంప్రదించగలిగారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..
అబ్దుల్ రషీద్, ఎ.తష్రీఫ్ గురువారం తెల్లవారుజామున కర్ణాటకలోని ఉప్పినంగడిలోని ఆసుపత్రికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా వారికి ప్రమాదం జరిగింది. గూగుల్ మ్యాప్స్ లో చూపించిన సూచనలను అనుసరిస్తూ రషీద్ కారు నడిపాడు. కాసేపటికి గూగుల్ మ్యాప్స్ ఇరుకైన రహదారిని చూపించింది. వారు దాని గుండా తమ కారును నడిపారు.
అలా వెళ్తుండగా వాహనం హెడ్ లైట్‌లో ముందట కొంత నీరు ఉన్నట్లుగా కనిపించింది. కానీ ఇరువైపులా నది ఉంది. వంతెనపైకి వెళ్లాం.. దానికి సైడ్ వాల్ కూడా లేదని రషీద్ తెలిపారు. బయట చీకటిగా ఉండడం, దారి కనిపించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని రషీద్ చెప్పుకొచ్చాడు.
కాస్త ముందుకు వెళ్లిన తర్వాత కారు అకస్మాత్తుగా నీటి ప్రవాహాలలో కొట్టుకుపోవడం ప్రారంభించింది. కానీ తరువాత నది ఒడ్డున ఉన్న ఒక చెట్టుకు చిక్కుకుంది. సైడ్ కిటికీలు కిందకు దించి వారు తప్పించుకోగలిగారు. ప్రమాదం గురించి ఫోన్ ద్వారా బంధువులకు తెలియజేయగా, వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
అనంతరం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తాళ్ల సాయంతో ఇద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. 'మేం తిరిగి బతికి వస్తామని ఎప్పుడూ అనుకోలేదు. ఇది నిజంగా పునర్జన్మగా భావిస్తున్నాం.' అని రషీద్ తెలిపాడు.
ప్రమాద స్థలానికి 500 మీటర్ల దూరంలో నాలుగేళ్ల క్రితం కొత్త పొడవైన వంతెనను నిర్మించారు. కానీ గూగుల్ మ్యాప్స్ ఇప్పటికీ పాత వంతెనను చూపిస్తుంది.
గూగుల్ మ్యాప్స్ తప్పుగా చూపించడం ఇదే ఇదే మొదటిసారి కాదు. గత నెలలో హైదరాబాద్ కు చెందిన కొందరు పర్యాటకులు గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి కొట్టాయంలోని కురుపంతర సమీపంలో వాగులోకి వెళ్లారు. సమీపంలోని పోలీసు పెట్రోలింగ్ యూనిట్, స్థానికుల ప్రయత్నాల వల్ల నలుగురూ ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకోగలిగారు. కాని వారి వాహనం పూర్తిగా నీటిలో మునిగిపోయింది.
భారీ వర్షాల కారణంగా వాగు నుంచి పొంగిపొర్లుతున్న నీటితో హైదరాబాద్ ప్రయాణికుల కారు మునిగిపోయింది. పర్యాటకులకు ఈ ప్రాంతానికి కొత్త కావడంతో గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి నావిగేట్ చేస్తూ నేరుగా జలాశయంలోకి వెళ్లారని పోలీసులు తెలిపారు.
Abdul Rashid and A Thashreef said they met with the accident at 6 am on Thursday while heading towards a hospital at Uppinangady in Karnataka. Rashid was behind the wheel, following the directions shown on Google Maps.
Rasheed said Google Maps showed a narrow road, and they drove their car through it.
‘No sidewall on the bridge’
"Using the vehicle's headlight, we felt that there was some water in front of us. But we didn't see a river on both sides and a bridge in the middle. There was also no sidewall for the bridge," PTI reported Rasheed as saying.
It was dark outside, and the path was not visible, leading to the accident, Rasheed added.
The car suddenly began to get carried away in the water currents but later got stuck in a tree on the river's shores.
They managed to escape by lowering the side windows. They informed their relatives about the accident via phone, who subsequently alerted fire force officials.
Later, Fire Force personnel rushed to the place and pulled out the two men to safety using ropes.
"We never thought that we could come back to life. We truly feel that it is a rebirth," Rasheed added.
It is important to note that a new, taller bridge was constructed 500 meters from the accident spot four years ago, but Google Maps still shows the old bridge.
Previous incidents
This is not the first such incident reported in Kerala.
Last month, a group of tourists from Hyderabad drove into a swollen stream near Kuruppanthara in Kottayam after using Google Maps.
All four managed to escape unharmed due to the efforts of a nearby police patrol unit and local residents, but their vehicle was completely submerged.
The road they were travelling on was covered by water overflowing from the stream due to the heavy rains, and since the tourists were unfamiliar with the area, they drove right into the water body while navigating using Google Maps, police said.