తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Fire Accident : మస్కిటో కాయిల్స్​​ వల్ల గదిలో మంటలు- ఇద్దరు సోదరులు దుర్మరణం!

Fire accident : మస్కిటో కాయిల్స్​​ వల్ల గదిలో మంటలు- ఇద్దరు సోదరులు దుర్మరణం!

Sharath Chitturi HT Telugu

23 December 2024, 6:40 IST

google News
    • Mosquito coil sparks fire : ఘజియాబాద్​లోని ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు సోదరులు ప్రాణాలు కోల్పోయారు! మస్కిటో కాయిల్స్​ వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.
ప్రమాదం జరిగిన గది..
ప్రమాదం జరిగిన గది..

ప్రమాదం జరిగిన గది..

ఉత్తర్​ప్రదేశ్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది! దోమలను చంపేందుకు ఉపయోగించే మస్కిటో కాయిల్స్​​.. ఘోర అగ్నిప్రమాదానికి కారణమయ్యయి. ఈ ఘటనలో ఇద్దురు సోదరులు మరణించారు. అసలేం జరిగిందంటే..

ఇదీ జరిగింది..

ఘజియాబాద్ జిల్లాలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. రాత్రి సమయంలో వారి తల్లి తమ చెక్క మంచం దగ్గర మస్కిటో కాయిల్స్ కట్టను వెలిగించిందని అధికారులు తెలిపారు.

మృతులను 12వ తరగతి చదువుతున్న అరుణ్ కుమార్ (20), అతని తమ్ముడు 10వ తరగతి విద్యార్థి వంశ్ కుమార్ (17)గా పోలీసులు గుర్తించారు.

ప్రమాదం సమయంలో వారు తమ ఇంట్లోని ఒక చిన్న గదిలో నిద్రపోతున్నారని అధికారులు తెలిపారు. మస్కిటో కాయిల్ గురించి కుటుంబ సభ్యులు చెప్పారని, తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఇద్దరూ నిద్రిస్తున్న చెక్క మంచానికి ఒక్కసారిగా మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గది లోపల దట్టమైన పొగలు వ్యాపించడంతో మంటలు చెలరేగాయి. ఇతర కుటుంబ సభ్యులు మేల్కొనే సమయానికి ఆ ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని, శరీరం పై భాగంలో కూడా కాలిన గాయాలయ్యాయని లోనీ సర్కిల్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సూర్యబలి మౌర్య తెలిపారు.

మృతుల తల్లిదండ్రులు, సోదరి ఇంటి ముందు భాగంలో నిద్రిస్తున్నారు. కాగా మృతుల తల్లి జాకెట్లు కుడుతుంటుంది. ఫలితంగా ఆ గదిలో ముడిసరుకు కూడా చాలా నిల్వ ఉంది. ఈ సామగ్రిలో కూడా మంటలు చెలరేగాయని అధికారులులు వివరించారు.

మంటల గురించి తెలుసుకున్న కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రాథమిక చికిత్స అందించినా ఆ తర్వాత మృతి చెందారు. ఆసుపత్రి నుంచి పోస్టుమార్టం రిపోర్టు కోరామని, మరణానికి కచ్చితమైన కారణాన్ని కనుగొంటామని అధికారులు చెప్పారు. ప్రాథమికంగా చూస్తే వారు ఊపిరాడక చనిపోయి ఉంటారని, గదిలో మంటలు చెలరేగడంతో కాలిన గాయాలతో మృతి చెంది ఉంటారని భావిస్తున్నట్టు వివరించారు.

మృతులను 12వ తరగతి విద్యార్థి అరుణ్ కుమార్ (20), అతని తమ్ముడు 10వ తరగతి విద్యార్థి వంశ్ కుమార్ (17)గా పోలీసులు గుర్తించారు.

వీరికి ఒక అన్న కూడా ఉన్నాడు. అతను నైట్​షిఫ్ట్ పనికి వెళ్లాడు అని ఏసీపీ తెలిపారు.

ఆదివారం వేకువజామున 3.18 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది.

“మా అధికారులు అక్కడికి చేరుకునే సరికి ఒక గదిలో మంటలు కనిపించాయి. ఇద్దరినీ స్థానికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఒక అగ్నిమాపక యంత్రాన్ని రంగంలోకి దించాం,” అని చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాహుల్ పాల్ తెలిపారు.

తదుపరి వ్యాసం