Astrologer Nidhi Chaudhary : ట్విట్టర్లో 'బ్లౌజ్' రచ్చ.. జ్యోతిష్కురాలిపై ట్రోల్స్!
11 September 2022, 19:08 IST
- Twitter trolls astrologer Nidhi Chaudhary : ట్విట్టర్లో ‘బ్లౌజ్’ అనే పదం ట్రెండ్ అవుతోంది. ఓ జ్యోతిష్కురాలు, ఆమె వేసుకున్న దుస్తులను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
నిధి చౌదరి
Twitter trolls astrologer Nidhi Chaudhary : ఈ టెక్ కాలంలో సోషల్ మీడియాలో చాలా విషయాలు.. నిమిషాల్లో వైరల్‌గా మారిపోతున్నాయి. కొన్నికొన్ని అసలు ఎందుకు వైరల్‌గా మారుతుంటాయో కూడా అర్థం కాదు. ఇక ట్విట్టర్ 'ట్రెండ్స్' గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 'బాయ్‌కాట్' నుంచి 'ఫిక్సింగ్' వరకు.. ఈ మధ్య కాలంలో అన్నీ తెగ ట్రెండ్ అవుతున్నాయి.. తెగ వైరల్ అవుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే.. ట్విట్టర్లో ఆదివారం 'బ్లౌజ్' అనే పదం ట్రెండింగ్‌గా మారింది. ఈ బ్లౌజ్ పదంపై నెటిజన్లు విపరీతంగా ట్వీట్లు చేస్తున్నారు. దీని వెనక ఓ కథ ఉంది. నిధి చౌదరి అనే జ్యోతిష్కురాలు చేసిన ఓ ట్వీట్‌కు సంబంధించిందే ఈ రచ్చ అంత. ఇంతకీ ఏం జరిగిందంటే..
నిధి చౌదరి అనే జ్యోతిష్కురాలు.. శనివారం ఓ వీడియోతో కూడిన ట్వీట్ చేసింది. శని దేవుడి ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటూ ఆమె ఆ వీడియో చెప్పుకొచ్చింది. ఇతరులకు సహాయం చేయాలి, అందరితో మంచిగా ఉండాలి అంటూ పలు వ్యాఖ్యలు చేసింది. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది.
కానీ నెటిజన్లు.. జ్యోతిష్కురాలు నిధి చౌదరి మాటలను పట్టించుకోకుండా.. ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌పై దృష్టిపెట్టారు! ఆ వీడియోలో నిధి చౌదరి బ్లౌజ్ కనిపించలేదు. బ్లౌజ్ లేకుండా.. శరీరానికి చీర కప్పుకున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. అది అసభ్యకరంగా ఏమీ లేదు. కానీ ఆ ట్వీట్‌తో పాటు నెటిజన్ల ట్రోల్స్.. ట్విట్టర్లో వైరల్‌గా మారిపోయాయి. ఇప్పుడు అవి ట్విట్టర్ ట్రెండింగ్ లిస్ట్‌లోకి చేరాయి.
Nidhi Chaudhary twitter : "నీకు డబ్బులు పంపిస్తా.. బ్లౌజ్ కుట్టించుకో," అంటూ ఓ వ్యక్తి ట్రోల్ చేశాడు. "బ్రహ్మాస్త చూడటం కన్నా.. ఆ డబ్బులతో ఈ పేద మహిళకు బ్లౌజ్ కుట్టించి ఇస్తే బాగుండేది," అని ఇంకొకరు ట్వీట్ చేశారు. "మాకు సలహాలు వద్దు.. నీకు మాత్రం బ్లౌజ్ కావాలి," అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చారు. 'ఈ విషయం తెలిసిన తర్వాత.. సోనూ సూద్.. జ్యోతిష్కురాలు నిధి చౌదరికి బ్లౌజ్ కుట్టిస్తున్నాడు,' అంటూ మరో వ్యక్తి ట్రోల్ చేశాడు.
ఇక తనపై వస్తున్న ట్రోల్స్‌ని తిప్పికొట్టే పనిలో పడింది జ్యోతిష్కురాలు నిధి చౌదరి. పలువురు ఆమెకు మద్దతుగా కూడా ట్వీట్లు చేస్తున్నారు. "అందులో అసభ్యకరంగా ఏమీ కనిపించడం లేదు. ఆమె బట్టలు.. ఆమె ఇష్టం," అని అంటున్నారు. 'మహిళలు బ్లౌజ్‌లు వేసుకోకుండా బయటకు వచ్చిన దేశం మనది,' అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చారు.
జ్యోతిష్కురాలు నిధి చౌదరికి ట్విట్టర్లో 14వేలకుపైగా మంది ఫాలోవర్లు ఉన్నారు. "నేను ఓ లాయర్. నేను ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెంజర్, నేను ఫ్యాషన్ స్టైలిస్ట్. నేను జ్యోతిష్కురాలిని కూడా. సెక్సీగా ఉండటం అంటే నాకు చాలా ఇష్టం," అని కొన్ని వారాల క్రితమే ట్వీట్ చేసింది నిధి చౌదరి.