Troll on Puri Jagannadh: "ముందు స్క్రిప్టుపై ఫోకస్ పెట్టు".. పూరిపై నెటిజన్లు ఫైర్..!
Netizens Fire on Puri Jagannadh: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో పూరి జగన్నాథ్‌పై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ముందు స్క్రిప్టుపై ఫోకస్ పెట్టాలని సూచించారి.
Trolls on Puri Jagannadh: విజయ్ దేవరకొండ హీరోగా.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరెకక్కిన లైగర్ చిత్రం గత నెల 25న విడుదలైన సంగతి తెలిసింది. తొలి రోజు నుంచే ఈ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు. అంతేకాకుండా పూరితో మరోసారి వర్క్ చేయొద్దంటూ విజయ్‌కు సలహాలు కూడా ఇస్తున్నారు. మరికొంతమందైతే ఓ అడుగు ముందుకెళ్లి పూరి జగన్నాథ్‌ను వినూత్నంగా ట్రోల్ చేస్తున్నారు. కరోనా మొదటి లాక్డౌన్ సమయంలో పూరి ఇచ్చిన వీడియో, ఆడియో సందేశాలపై మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు.
కరోనా సమయంలో పూరి జగన్నాథ్ ప్రజల్లో స్ఫూర్తి నింపేలా వీడియో, ఆడియో సందేశాలను పంపారు. ఇంట్లోనే ఉండాలంటూ తన దైన శైలిలో, సింపుల్ స్టోరీల రూపంలో సందేశాలను అందించారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన పాడ్‌క్యాస్టులు విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో ఆయన క్రేజ్ కూడా బాగా పెరిగింది. పూరి మ్యూజింగ్స్(Puri's Musings) పేరుతో విడుదల చేసిన ఆ సందేశాలే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకతను తీసుకొస్తున్నాయి.
లైగర్ సినిమా పరాజయం కావడంతో సినీ ప్రియులే కాకుండా విజయ్ అభిమానులు తీవ్రంగా నిరాశకు లోనయ్యారు. దీంతో దర్శకుడు పూరి జగన్నాథ్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ గతంలో ఆయన చేసిన వీడియో, ఆడియో సందేశాలపై ట్రోలింగ్ చేస్తున్నారు. మీమ్స్ క్రియేట్ చేస్తూ పరోక్షంగా పూరిపై మండిపడుతున్నారు. ముందు సినిమా స్క్రిప్టుపై దృష్టి సారించాలని, తర్వాత ఇలాంటి సందేశాలను ఇవ్వాలని సలహా ఇస్తున్నారు.
"అర్ధరాత్రి పూట అనవసర ఫిలాసఫలను రికార్డు చేయడం కంటే మెరుగైన సన్నివేశాలను రాయడంలో దృష్టి పెట్టాలి. అదే చేసుంటే లైగర్ ఫలితం ఇంకోలా ఉండేది" అంటూ ఓ యూజర్ స్పందించాడు. "ఔట్ డేటెట్ స్క్రిప్టుతో లైగర్ తీశాడని" ఇంకొకరు స్పందించారు. స్క్రిప్టుపై దృష్టి సారించాలని మరొకరు తన స్పందనను తెలియజేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూరిపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. లైగర్‌పై అంచనాలు ఏర్పాటు చేసి సినిమా ఆ రేంజ్‌లో లేకపోవడంతో ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు.
విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం గత నెల 25న విడుదలైంది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఆయనతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇది విజయ్‌కు హిందీలో తొలి చిత్రం. రమ్య కృష్ణ ఇందులో రౌడీ హీరోకు తల్లి పాత్రలో కనిపించింది. అనన్యా పాండే హీరోయిన్ కాగా.. రోనిత్ రాయ్ విజయ్‌కు కోచ్ పాత్రలో కనిపించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సంబంధిత కథనం