Tata Motors : వాహనాల ధరలను మళ్లీ పెంచిన టాటా మోటార్స్..
09 July 2022, 13:12 IST
Tata Motors price hike : వాహనాల ధరలను టాటా మోటార్స్ మరోమారు పెంచింది. 0.55శాతం పెంపు శనివారం నుంచే అమల్లోకి వచ్చింది.
వాహనాల ధరలను మళ్లీ పెంచిన టాటా మోటార్స్..
Tata Motors price hike : మధ్యతరగతి ప్రజలకు టాటా మోటార్స్ మరో షాక్ ఇచ్చింది. ప్యాసింజర్ వాహనాల ధరలను మళ్లీ పెంచుతున్నట్టు శనివారం ప్రకటించింది. పెంచిన ధరలు శనివారం నుంచే అమల్లోకి వస్తున్నట్టు వెల్లడించింది. ముడిసరకు ధరలు పెరుగుతుండటంతో వాహనాల ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది.
ప్యాసింజర్ వాహనాల ధరలను తాజాగా 0.55శాతం పెంచింది టాటా మోటార్స్. మోడల్, వేరియంట్ ఆధారంగా ఈ పెంపు ఉంటుందని స్పష్టం చేసింది. అయితే.. ముడిసరకు ధర పెరుగుదలతో పోల్చితే.. తమ కంపెనీ చాలా తక్కువ రేట్ హైక్ తీసుకుంటోందని వెల్లడించింది.
టాటా మోటార్స్‌కు చెందిన టాటా పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ వంటి మోడల్స్.. ప్రస్తుతం మార్కెట్లో టాప్‌లో ఉన్నాయి.
ఈ నెలలో టాటా మోటార్స్ వాహనాల ధరలు పెరగడం ఇది రెండోసారి! ఈ నెలలో టాటా మోటార్స్ ధరలను ఇప్పటికే 1.5-2.5శాతం పెంచింది.