Tata Motors sales : టాటా మోటార్ సేల్స్ జూన్‌లో 82 శాతం అప్-tata motors sales up 82 pc in jun ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Tata Motors Sales : టాటా మోటార్ సేల్స్ జూన్‌లో 82 శాతం అప్

Tata Motors sales : టాటా మోటార్ సేల్స్ జూన్‌లో 82 శాతం అప్

HT Telugu Desk HT Telugu
Jul 01, 2022 04:40 PM IST

టాటా మోటార్స్ సంస్థ అమ్మకాలు జూన్‌లో 82 శాతం పెరిగాయి.

<p>టాటా మోటార్స్ నెక్సాన్ కారు</p>
టాటా మోటార్స్ నెక్సాన్ కారు (REUTERS)

న్యూఢిల్లీ, జూలై 1: టాటా మోటార్స్ కంపెనీ జూన్ అమ్మకాలు 82 శాతం పెరిగాయని, దేశీయంగా 79,606 కార్లు అమ్ముడయ్యాయని సంస్థ తెలిపింది.

గత ఏడాది ఇదే కాలంలో టాటా మోటార్స్ కార్లు 43,704 మాత్రమే అమ్ముడైనట్టు సంస్థ తెలిపింది.

దేశీయ ప్యాసింజర్ వాహనాల (పీవీ) అమ్మకాలు కూడా 87 శాతం పెరిగాయని, 45,197గా నమోదయ్యాయని వివరించింది. ఏడాది క్రితం ఇదే నెలలో ప్యాసింజర్ వెహికిల్స్ 24,110 అమ్ముడయ్యాయని తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 మొదటి త్రైమాసికంలో పాసింజర్ వెహికిల్స్ 1,30,125 అమ్ముడయ్యాయని, గత ఏడాది మొదటి త్రైమాసికంలో ఇవి 64,386 యూనిట్లుగా ఉన్నాయని వివరించింది.

‘మొదటి త్రైమాసికంలో పాసింజర్ వెహికిల్స్‌కు డిమాండ్ బలంగా ఉంది. చైనాలో లాక్‌డౌన్ కారణంగా సరఫరా అంతరాయాలు ఉన్నప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగింది..’ అని వివరించింది.

‘ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మా ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియో 68 శాతంగా ఉంది. తొలి త్రైమాసికంలో ఎలక్ట్రికల్ వాహనాలు 9,283 అమ్ముడయ్యాయి. జూన్‌లో నెలలో అత్యధికంగా 3,507 యూనిట్లు అమ్ముడయ్యాయి..’ అని టాటా మోటార్స్ పాసింజర్ వెహికిల్స్ లిమిటెడ్, టాటా పాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు.

కీలకమైన ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ సహా సరఫరా వ్యవస్థ మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. పెరుగుతున్న డిమాండ్, సరఫరా వ్యవస్థ స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వివరించారు.

దేశీయ మార్కెట్లో వాణిజ్య వాహనాల అమ్మకాలు 34,409 యూనిట్లుగా ఉన్నాయి. 2021 జూన్‌లో ఇదే సెగ్మెంట్‌లో 19,594 యూనిట్లుగా ఉన్నాయి. అంటే 76 శాతం వృద్ధి నమోదైంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కమర్షియల్ వాహనాలు 95,703 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో 43,400గా ఉన్నాయి.

ప్రాంతాలు, సెగ్మెంట్లకు అతీతంగా మొదటి త్రైమాసికంలో వృద్ధి నమోదైందని టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ తెలిపారు.

రహదారుల నిర్మాణం, మైనింగ్, వ్యవసాయ రంగం, ఈకామర్స్ రంగంలో పెరుగుతున్న కార్యకలాపాలు కమర్షియల్ వెహికిల్ సెగ్మెంట్‌లో వృద్ధికి దోహదపడ్డాయని వివరించారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్