తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet Student Suicide : 'నీట్​'లో ఫెయిల్​ అయ్యాడని విద్యార్థి ఆత్మహత్య.. మరుసటి రోజే తండ్రి కూడా!

NEET student suicide : 'నీట్​'లో ఫెయిల్​ అయ్యాడని విద్యార్థి ఆత్మహత్య.. మరుసటి రోజే తండ్రి కూడా!

Sharath Chitturi HT Telugu

14 August 2023, 11:58 IST

google News
  • NEET student suicide : నీట్​లో ఫెయిల్​ అవ్వడంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఓ విద్యార్థి. ఈ ఘటనతో మానసిక క్షోభకు గురైన అతని తండ్రి.. మరుసటి రోజే ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

'నీట్​'లో ఫెయిల్​ అయ్యాడని విద్యార్థి ఆత్మహత్య.. తండ్రి కూడా!
'నీట్​'లో ఫెయిల్​ అయ్యాడని విద్యార్థి ఆత్మహత్య.. తండ్రి కూడా!

'నీట్​'లో ఫెయిల్​ అయ్యాడని విద్యార్థి ఆత్మహత్య.. తండ్రి కూడా!

NEET student suicide : తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మెడికల్​ ఎంట్రెన్స్​ ఎగ్జామ్​ నీట్​లో రెండుసార్లు విఫలమయ్యాడన్న బాధతో ఓ 19ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే.. అతని తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు!

నీట్​ పాస్​ అవ్వలేదని..!

తమిళనాడు రాజధాని చెన్నైలోని క్రోమపేట్​లో ఈ ఘటన జరిగింది. 19ఏళ్ల ఎస్ జగదీశ్వరన్​.. నీట్​ పరీక్ష కోసం చాలా కష్టపడ్డాడు. కానీ రెండుసార్లు విఫలమయ్యాడు. ఆ బాధతో.. ఈనెల 12న, తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.

Tamil Nadu NEET suicide : జగదీశ్వరన్​ ఆత్మహత్య చేసుకున్న సమయంలో అతని తండ్రి సెల్వశేఖర్​ ఇంట్లో లేడు. ఇంటికి వెళ్లేసరికి, కుమారుడి మృతదేహాన్ని చూసి విలపించాడు. మానసిక క్షోభకు గురయ్యాడు. మరుసటి రోజు అతను కూడా ప్రాణాలు తీసుకున్నాడు.

"నేను సింగిల్​ పేరెంట్​ని. జగదీశ్వరన్​ రెండుసార్లు నీట్​లో విఫలమైన తర్వాత.. అతడిని కోచింగ్​ సెంటర్​లో చేర్పించాను. వాస్తవానికి వారం రోజులుగా అతను సరిగ్గా తినడం లేదు. నాకు వర్క్​ ఉండి బయటకు వెళ్లాను. మధ్యాహ్నం ఫోన్​ చేశాను. లిఫ్ట్​ చేయలేదు. ఇంటికి వచ్చేసరికి.. నా కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​.. నీట్​ పరీక్షను రద్దు చేసి విద్యార్థుల జీవితాలను కాపాడతానని తన మేనిఫెస్టోలో చెప్పారు. కానీ అలా జరగలేదు. నా బిడ్డ బతికి లేడు. ఇలాంటి దురదృష్ట ఘటన ఎవరికి ఎదురవ్వకూడదు," అని చెప్పి, ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు సెల్వశేఖర్​.

సెల్వశేఖర్​ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. జగదీశ్వరన్​ మృతదేహాన్ని కూడా ఇదే ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ముఖ్యమంత్రి స్టాలిన్​ స్పందన..

NEET suicides in Tamil Nadu : నీట్​ పరీక్ష నేపథ్యంలో తండ్రి, కుమారుల మరణంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నీట్​ను రద్దు చేయగలమని, విద్యార్థులు ఆత్మహత్య వంటి ఆలోచనలను మానుకోవాలని సూచించారు.

"జగదీశ్వరన్​ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి షాక్​కు గురయ్యాను. అతని తండ్రికి ఎలా సంఘీభావం చెప్పాలని ఆలోచిస్తుండగా.. సెల్వశేఖర్​ కూడా ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. వారి కుటుంబానికి నేను ఎలా సంఘీభావం చెప్పాలో అర్థం కావడం లేదు," అని స్టాలిన్​ అన్నారు.

"మీరు ఆత్మహత్యలు చేసుకోకండి. నీట్​ను తొలగిస్తామని మాకు నమ్మకం ఉంది. మీ లక్ష్యాలకు అడ్డంకిగా ఉన్న నీట్​ను తొలగించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది," అని స్టాలిన్​ తెలిపారు.

Tamil Nadu latest news : ఎంబీబీఎస్​, బీడీఎస్​ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్​ను రాష్ట్రంలో రద్దు చేసేందుకు అసెంబ్లీలో ఓ బిల్లును ఆమోదించింది ఎంకే స్టాలిన్​ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం. కానీ దీనికి ఆ రాష్ట్ర గవర్నర్ రవి​ ఆమోదం తెలపలేదు. కొన్ని మార్పుల తర్వాత ఆ బిల్లులను తిరిగి గవర్నర్​కు పంపించింది ప్రభుత్వం. ఆ బిల్లును గవర్నర్​.. రాష్ట్రపతికి పంపించారు.

అయితే.. నీట్​లో మంచి ర్యాంక్​లు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గవర్నర్​ ఆర్​ ఎన్​ రవిని కలిశారు. ఈ సందర్భంగా.. బిల్లుకు తాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదం తెలపనని ఆయన వ్యాఖ్యానించారు.

తదుపరి వ్యాసం