SSC CGL Answer Key : ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్ 1 ఆన్సర్ కీ విడుదల- ఇలా చెక్ చేసుకోండి..
04 October 2024, 7:20 IST
SSC CGL Answer Key 2024 : ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్ 1 ఆన్సర్ కీ విడుదలైంది. అభ్యర్థులు ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ssc.gov.in లో చెక్ చేసుకోండి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్ 1 ఆన్సర్ కీ విడుదల
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టైర్ 1 పరీక్ష కోసం ఎస్ఎస్సీ సీజీఎల్ ఆన్సర్ కీ 2024ని తాజాగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ssc.gov.in ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్లో ప్రొవిజనల్ ఆన్సర్ కీని చెక్ చూసుకోవచ్చు.
ఎస్ఎస్సీ సీజీఎల్ ఆన్సర్ కీ 2024ని చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
"తాత్కాలిక ఆన్సర్ కీలతో పాటు అభ్యర్థి రెస్పాన్స్ షీట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిని కమిషన్ వెబ్సైట్ ( https://ssc.gov.in/) ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఉపయోగించి నిర్దేశిత వ్యవధిలో లాగిన్ కావచ్చు. రెస్పాన్స్ షీట్/ఆన్సర్ కీ ఛాలెంజ్ యాక్సెస్ చేసుకోవడానికి సూచనల వివరాలు అందులో ఉంటాయి," అని అధికారిక నోటిఫికేషన్లో ఉంది.
ఇదీ చూడండి:- Education decisions : ఇండియాలోనే చదువుకోవాలా? విదేశాలకు వెళ్లాలా? ఇవి తెలుసుకుని నిర్ణయం తీసుకోండి..
టైర్ 1 కోసం ఎస్ఎస్సీ సీజీఎల్ ఆన్సర్ కీ 2024ని ఇలా చెక్ చేసుకోండి..
- ssc.gov.in వద్ద ఎస్ఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఎస్ఎస్సీ సీజీఎల్ ఆన్సర్ కీ 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
- అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- సబ్మిట్పై క్లిక్ చేస్తే ఆన్సర్ కీ కనిపిస్తుంది.
- ఆన్సర్ కీని చెక్ చేసి పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.
ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకుంటే 2024 అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 2024 అక్టోబర్ 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ప్రతి ప్రశ్న/సమాధానానికి రూ.100 చెల్లించి ఆన్లైన్లో వినతిపత్రాలు సమర్పించవచ్చని నోటీసులో పేర్కొన్నారు. అక్టోబర్ 6, 2024 సాయంత్రం 6.00 గంటల తర్వాత వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించరని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి.
సీహెచ్ఎస్ఎల్ టైర్ 2 పరీక్ష తేదీ..
ఎస్ఎస్సీ సిహెచ్ఎస్ఎల్ టైర్ 2 పరీక్ష 2024 తేదీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్, 2024 (టైర్-2) కు హాజరయ్యే అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ssc.gov.in లో దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను చూడవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.