Education decisions : ఇండియాలోనే చదువుకోవాలా? విదేశాలకు వెళ్లాలా? ఇవి తెలుసుకుని నిర్ణయం తీసుకోండి..
Education in India : భారత్ దేశంలో చదువుకోవాలా? లేక చదువు కోసం విదేశాలకు వెళ్లాలా? ఈ ప్రశ్న మిమ్మల్ని వేధిస్తోందా? అయితే ఇది మీకోసమే! కొన్ని విషయాలు మీరు తెలుసుకుంటే, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు. అవేంటంటే..
ఇటీవలి కాలంలో చదువు కోసం విదేశాలకు వెళుతున్న భారతీయుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అయితే ఇండియాలోనే చదువుకోవాలా? లేక విదేశాలకు వెళ్లాలా? అన్న విషయంపై చాలా మందిలో అయోమయం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని విషయాలును తెలుసుకుంటే ఈ రెండు ఆప్షన్స్‌లో ఒకటి ఎంచుకోవచ్చు. విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాల్సిన కొన్ని ముఖ్య అంశాలను ఇక్కడ చూడండి..
ఇలా నిర్ణయం తీసుకోండి..
నాణ్యత: భారతీయ సంస్థలు ప్రపంచ స్థాయి తరగతి గది విద్యను అందిస్తాయి. కానీ విదేశాలలో చదవడం తరచుగా అధునాతన పరిశోధన సౌకర్యాలు, వైవిధ్యమైన విద్యా విభాగాలను అందిస్తుంది.
కరిక్యులమ్ ఫ్లెక్సిబులిటీ: విదేశీ విశ్వవిద్యాలయాలు సాధారణంగా మరింత సరళమైన, ఇంటర్ డిసిప్లినరీ కోర్సులను అందిస్తాయి. ఈ విషయంలో భారత విద్యాసంస్థలు కాస్త మెరుగుపడాలి.
గుర్తింపు, ఖ్యాతి: ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల డిగ్రీలు కొన్ని భారతీయ విశ్వవిద్యాలయాల కంటే ఎక్కువ ప్రపంచ గుర్తింపును కలిగి ఉండవచ్చు. ఇది భవిష్యత్తు కెరీర్ అవకాశాలను కచ్చితంగా ప్రభావితం చేస్తుంది.
ఆర్థిక పరిగణనలు: అధిక ట్యూషన్ ఫీజులు, జీవన ఖర్చుల కారణంగా విదేశాల్లో చదవడం గణనీయంగా ఖరీదైనది. అయితే, స్కాలర్షిప్, ఆర్థిక సహాయం తరచుగా లభిస్తాయి.
రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్: విదేశాల్లో ప్రారంభ వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ, జీతం, కెరీర్ అవకాశాలు మెరుగ్గా ఉండటంతో ఆ ఖర్చులను భర్తీ అవ్వొచ్చు. ఇది దీర్ఘకాలిక పెట్టుబడిగా మారుతుంది.
లోకల్ వర్సెస్ ఫారిన్ ఎక్స్ఛేంజ్: భారతదేశంలో చదువుకోవడానికి స్థానిక కరెన్సీని వాడుకోవాలి. అయితే విదేశాలలో చదువుకోవడానికి విదేశీ మారకద్రవ్యాన్ని ఫాలో అవ్వాలి. ఇది మన బడ్జెట్‌ని ప్రభావితం చేస్తుంది.
సాంస్కృతిక సామాజిక పరిస్థితులు..
సాంస్కృతిక మార్పులు: భారతదేశంలోనే ఉండటం వల్ల విద్యార్థులు సుపరిచితమైన సాంస్కృతిక, సామాజిక వాతావరణంలో ఉండటానికి అనుమతిస్తుంది.
కల్చరల్ ఎక్స్పోజర్: విదేశాలకు వెళ్లడం అనేది ఒక కొత్త సంస్కృతిని ఎక్స్‌పీరియెన్స్ చేసేందుకు ఉపయోగపడుతుంది.
సపోర్ట్ సిస్టెమ్స్: భారతదేశంలో కుటుంబం, స్నేహితులకు దగ్గరగా ఉండటం బలమైన సపోర్ట్ సిస్టెమ్ని అందిస్తుంది. అయితే విదేశాల్లో, విద్యార్థులు మొదటి నుంచి కొత్త నెట్వర్క్ని నిర్మించాల్సి ఉంటుంది.
కెరీర్ అవకాశాలు- ఉపాధి..
లోకల్ జాబ్ మార్కెట్: ప్రస్తుత భారత మార్కెట్లో ముఖ్యంగా ఐటి, ఫైనాన్స్ లేదా ప్రభుత్వ సేవలు వంటి రంగాలలో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునేవారికి దేశంలోనే ఉండటం ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గ్లోబల్ ఎంప్లాయిమెంట్: విదేశాల్లో చదువుకోవడం వల్ల అంతర్జాతీయ జాబ్ మార్కెట్లకు, గ్లోబల్ కంపెనీల అవకాశాలు మెరుగుపడొచ్చు. అధిక జీతాలు, మరింత వైవిధ్యమైన కెరీర్ మార్గాలను పొందొచ్చు.
వర్క్ ఆథరైజేషన్: అంతర్జాతీయ విద్యార్థులు తరచుగా వీసా, వర్క్ ఆథరైజేషన్ సవాళ్లను ఎదుర్కొంటారు. ఇది గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగ అవకాశాలను ప్రభావితం చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి.
పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌లు- సపోర్ట్..
స్థానిక పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌లు: భారతీయ సంస్థలు బలమైన స్థానిక పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌లను కలిగి ఉన్నాయి. ఇవి దేశంలో మార్గదర్శకత్వం, ఉద్యోగ నియామకాలకు విలువైనవి.
గ్లోబల్ కనెక్షన్స్: ప్రతిష్ఠాత్మక విదేశీ విశ్వవిద్యాలయాల పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌లు తరచుగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. విస్తృతమైన వృత్తిపరమైన నెట్‌వర్క్‌లు అవకాశాలను అందిస్తాయి.
సంస్థాగత మద్దతు: విదేశీ విశ్వవిద్యాలయాలు మెరుగైన కెరీర్ సేవలు, ఇంటర్న్‌షిప్, ప్లేస్మెంట్ మద్దతును అందించవచ్చు. ఇవి ప్రపంచ ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశించడానికి కీలకమైనవి!
ప్రాధాన్యతలు..
స్థిరత్వం వర్సెస్ సాహసం: భారతదేశంలో ఉండటం వృత్తి, కుటుంబ జీవితం పరంగా మరింత స్థిరత్వాన్ని అందిస్తుంది. విదేశాలకు వెళ్లడం మరింత సాహసోపేతమైన, వైవిధ్యమైన జీవనశైలిని అందిస్తుంది.
కుటుంబం, సామాజిక జీవితం: కుటుంబం, సాంస్కృతిక మూలాలకు దగ్గరగా ఉండటానికి ఇష్టపడేవారికి, భారతదేశంలో ఉండటం మరింత అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లడం అంటే ఎక్కువ స్వాతంత్ర్యాన్ని పొందొచ్చు. కాని కుటుంబ మద్దతు తగ్గిపోతుంది.
లాంగ్ టర్మ్ రెసిడెన్సీ: విదేశాలకు వెళ్లడం వల్ల మరో దేశంలో శాశ్వత నివాసం లేదా పౌరసత్వం పొందే అవకాశాలు ఏర్పడతాయి. ఇది జీవనశైలి, భవిష్యత్తు కుటుంబ నియంత్రణను ప్రభావితం చేస్తుంది.
పైన చెప్పిన వాటిని సరిపోల్చి, ఇండియాలో చదువుకోవాలా? లేక విదేశాలకు వెళ్లాల అన్నది మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు.
(రచయిత్రి- సునీత శ్రీవాస్తవ ఆదిత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్)
సంబంధిత కథనం