SSC CHSL Tier II Exam: సీహెచ్ఎస్ఎల్ టైర్ 2 పరీక్ష తేదీని ప్రకటించిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్-ssc chsl tier ii exam 2024 date out at ssc gov in check notice here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ssc Chsl Tier Ii Exam: సీహెచ్ఎస్ఎల్ టైర్ 2 పరీక్ష తేదీని ప్రకటించిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్

SSC CHSL Tier II Exam: సీహెచ్ఎస్ఎల్ టైర్ 2 పరీక్ష తేదీని ప్రకటించిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్

Sudarshan V HT Telugu
Sep 26, 2024 03:08 PM IST

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ 2024 ఎగ్జామినేషన్ (టైర్-2) తేదీని గురువారం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ప్రకటించింది. ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ టైర్ 2 ఎగ్జామ్ 2024 కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎస్సెస్సీ అధికారిక వెబ్ సైట్ ssc.gov.in ను చూడండి.

సీహెచ్ఎస్ఎల్ టైర్ 2 పరీక్ష తేదీలను ప్రకటించిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్
సీహెచ్ఎస్ఎల్ టైర్ 2 పరీక్ష తేదీలను ప్రకటించిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ssc.nic.in)

ఎస్ఎస్సీ సిహెచ్ఎస్ఎల్ టైర్ 2 పరీక్ష 2024 తేదీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గురువారం విడుదల చేసింది. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్, 2024 (టైర్-2) కు హాజరయ్యే అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ssc.gov.in లో దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ ను చూడవచ్చు.

నవంబర్ లో పరీక్ష

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్, 2024 (టైర్-2) 2024 నవంబర్ 18న జరగనుంది. ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ టైర్ 2 ఎగ్జామ్ 2024 కు సంబంధించిన అప్ డేట్స్ కోసం అభ్యర్థులు రెగ్యులర్ గా ఎస్సెస్సీ (SSC) వెబ్ సైట్ ssc.gov.in ను సందర్శించాలని కమిషన్ కోరింది. ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ టైర్ 1 పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు టైర్ 2 పరీక్షకు హాజరు కావడానికి అర్హులు అవుతారు. టైర్-1 ఫలితాలను 2024 సెప్టెంబర్ 6న ప్రకటించారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ టైర్-1 పరీక్షను జూలై 1 నుండి జూలై 11, 2024 వరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (staff selection commission) నిర్వహించింది.

ఏయే ఉద్యోగాలు..

ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ టైర్ 2 (SSC CHSL Tier II Exam 2024) పరీక్షకు లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) పోస్టులకు 39,835 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)/డీఈవో గ్రేడ్ 'ఏ' పోస్టులకు 1630 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వివిధ కారణాలతో 23 మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపివేశారు. ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ పరీక్ష ద్వారా భారత ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ కార్యాలయాలు, వివిధ రాజ్యాంగ సంస్థలు/ చట్టబద్ధ సంస్థలు/ ట్రిబ్యునళ్లలో లోయర్ డివిజనల్ క్లర్క్/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు సహా సుమారు 3,712 గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ ఎగ్జామ్ కు ఏప్రిల్ 8న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 మే 7న ముగిసింది.