SSC CHSL Tier I 2022: ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ టయర్ 1 అదనపు ఫలితాల వెల్లడి
కంబైన్డ్ హయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2022 టయర్ 1 (CHSLE 2022 Tier-I) కు సంబంధించిన అదనపు ఫలితాలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది.
కంబైన్డ్ హయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2022 టయర్ 1 (CHSLE 2022 Tier-I) కు సంబంధించిన అదనపు ఫలితాలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాలను ఎస్ఎస్సీ అధికారిక వెబ్ సైట్ ssc.nic.in లో చెక్ చేసుకోవచ్చు.
520 మంది ఉత్తీర్ణత
కంబైన్డ్ హయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2022 టయర్ 1 (CHSLE 2022 Tier-I) అదనపు ఫలితాల్లో 520 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆ 520 మంది డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ (DEST) రాయాల్సి ఉంటుంది. కంబైన్డ్ హయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2022 టయర్ 1 (CHSLE 2022 Tier-I) ఫలితాలను మే 19న ఎస్ఎస్సీ విడుదల చేసింది. ఆ ఫలితాల్లో మొత్తం 40224 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. వారు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఎల్డీసీ, జేఎస్ఏ, జేపీఏ తదితర పోస్ట్ లకు షార్ట్ లిస్ట్ అయ్యారు. వారు టయర్ 2 టెస్ట్ రాయాల్సి ఉంటుంది. వారు కాకుండా అదనంగా మరో 520 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ ల కోసం షార్ట్ లిస్ట్ చేశారు.
ఫలితాలను చెక్ చేసుకోవడం ఇలా..
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ssc.nic.in ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీపై రిజల్ట్ లింక్ ను క్లిక్ చేయాలి. ఆ తరువాత CHSL లింక్ పై క్లిక్ చేయాలి.
- ఆ తరువాత స్క్రీన్ పై కనిపిస్తున్న “Combined Higher Secondary (10+2) Level Examination (Tier-I), 2022 - List of the candidates shortlisted for appearing in Tier-II (in Roll Number Order)” పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్ పై పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. అందులో రోల్ నంబర్ల ప్రకారం రిజల్ట్ ను చెక్ చేసుకోవచ్చు.