SSC CHSL 2022 tier 1 results: ఎస్ఎస్సీ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ టయర్ 1 ఫలితాల వెల్లడి-ssc chsl 2022 tier 1 result declared check list of shortlisted candidates here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ssc Chsl 2022 Tier 1 Result Declared, Check List Of Shortlisted Candidates Here

SSC CHSL 2022 tier 1 results: ఎస్ఎస్సీ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ టయర్ 1 ఫలితాల వెల్లడి

HT Telugu Desk HT Telugu
May 19, 2023 09:53 PM IST

SSC results: కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10+2) ఎగ్జామినేషన్ 2022 టయర్ 1 (Combined Higher Secondary Level Examination) ఫలితాలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (Staff Selection Commission SSC) శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాలను అభ్యర్థులు ssc.nic.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (ssc.nic.in)

SSC CHSL 2022 tier 1 results: కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10+2) ఎగ్జామినేషన్ 2022 టయర్ 1 (Combined Higher Secondary (10+2) Level Examination) ఫలితాలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (Staff Selection Commission SSC) శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాలను అభ్యర్థులు ssc.nic.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

SSC CHSL 2022 tier 1 results: జూన్ 26న టయర్ II పరీక్ష

ఈ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10+2) ఎగ్జామినేషన్ 2022 టయర్ 1 () ను ఎస్ఎస్సీ మార్చి 9 నుంచి మార్చి 21 వరకు నిర్వహించింది. ఇది కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. ఈ పరీక్షలో ఉత్తీర్ణులై షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు టయర్ 2 (Tier-II) పరీక్షకు హాజరవాల్సి ఉంటుంది. మొత్తం 40224 అభ్యర్థులు టయర్ 2 (Tier-II) పరీక్ష రాయడానికి ఉత్తీర్ణత సాధించారు. ఈ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10+2) ఎగ్జామినేషన్ 2022 టయర్ II (Combined Higher Secondary (10+2) Level Examination) పరీక్ష 2023 జూన్ 26వ తేదీన జరుగుతుంది.

SSC CHSL 2022 tier 1 results: రిజల్ట్ చెక్ చేసుకోవడం ఎలా?

  • ఎస్ఎస్సీ అధికారిక వెబ్ సైట్ ssc.nic.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
  • Combined Higher Secondary (10+2) Level Examination result లింక్ పై క్లిక్ చేయాలి.
  • కొత్త పీడీఎఫ్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
  • రోల్ నెంబర్ ఆధారంగా ఆ పీడీఎఫ్ లో రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు

SSC CHSL Tier I list of qualified candidates

WhatsApp channel