తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ayodhya Ram Mandir : ‘అయోధ్యపై సీతా మాత శాపం తొలగిపోయింది!’

Ayodhya ram mandir : ‘అయోధ్యపై సీతా మాత శాపం తొలగిపోయింది!’

Sharath Chitturi HT Telugu

29 December 2023, 8:05 IST

google News
    • Ayodhya ram mandir : అయోధ్యపై సీతా మాత ఇచ్చిన శాపం ఎట్టకేలకు తొలగిపోయిందని అంటున్నారు​ మోహన్ ప్రతాప్​ మిశ్రా. 19వ శతాబ్దంలో అయోధ్యను పాలించిన రాజు కుటుంబ సభ్యుడు ఈ మోహన్​.
‘అయోధ్యపై సీతా మాత శాపం తొలగిపోయింది!’
‘అయోధ్యపై సీతా మాత శాపం తొలగిపోయింది!’ (HT_PRINT)

‘అయోధ్యపై సీతా మాత శాపం తొలగిపోయింది!’

Ayodhya ram mandir : రామ మందిర ప్రారంభోత్సవం సమీపిస్తున్న తురణంలో.. ఉత్తర్​ ప్రదేశ్​ అయోధ్యలో సందడి వాతావరణం నెలకొంది. ప్రారంభోత్సవం కోసం పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో అక్కడి తాజా పరిస్థితులపై 'ఆయోధ్య రాజు'గా పేరొందిన బీమ్లేందర్​ మోహన్​ ప్రతాప్​ మిశ్రా స్పందించారు. 'అయోధ్యపై సీతా మాత శాపం ఎట్టకేలకు తొలగిపోయింది,' అని అన్నారు.

ఎవరీ అయోధ్య రాజు..!

19వ శాతాబ్దంలో అయోధ్యను దర్షన్​ సింగ్​ అనే రాజు పరిపాలించాడు. ఆయన కుటుంబానికి చెందిన వారే ఈ మోహన్​ ప్రతాప్​ మిశ్రా. ఆయనను అయోధ్య వాసులు.. రాజా సాహెబ్​ అని పిలుచుకుంటారు. రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​లో ఆయన సభ్యుడిగా ఉన్నారు.

రామ మందిర నిర్మాణం నేపథ్యంలో అయోధ్యలో జరుగుతున్న అభివృద్ధిపై మోహన్​ ప్రతాప్​ మిశ్రా తాజాగా స్పందించారు.

Ayodhya ram mandir latest news : "2019 నవంబర్​లో అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. దాని కన్నా ముందు.. ఇక్కడ ఒక్క మంది హోటల్​ కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అయోధ్యలో 5 స్టార్​ హోటల్స్​ నిర్మాణం కోసం 100కుపైగా అప్లికేషన్లు వచ్చాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. రానున్న ఏళ్లల్లో అయోధ్య స్మార్ట్​ సిటీగా ఎదుగుతుందంటున్నారు. 5ఏళ్లల్లో.. ప్రజలు ఇక్కడికి కేవలం దర్శనం కోసమే కాకుండా.. నగరాన్ని చూడటానికి కూడా వస్తారని నాకు అనిపిస్తోంది. దేశంలోనే అత్యంత పవిత్రమైన నగరంగా అయోధ్య నిలిచిపోతుంది," అని అన్నారు మోహన్​ ప్రతాప్​ మిశ్రా.

అయోధ్యలో జరుగుతున్న అభివృద్ధిని చూసి.. 'నగరంపై సీతా మాత శాపం ఎట్టకేలకు తొలగిపోయింది,' అని అన్నారు మోహన్​ మిశ్రా.

రావణుడుని హతమార్చి, సీతా దేవిని తిరిగి ఆయోధ్యకు తీసుకొస్తాడు రాముడు అని రామాయణం ద్వారా తెలుస్తోంది. అయితే.. ఆ తర్వాత వచ్చిన పలు ఆరోపణలతో.. సీతా మాతను అయోధ్య నుంచి బహిష్కరిస్తారని హిందువులు విశ్వసిస్తారు. ఆ సమయంలో.. అయోధ్యకు సీతా మాత శాపం ఇచ్చినట్టు అక్కడి ప్రజలు నమ్ముతారు. అందుకే ఇంతకాలం అభివృద్ధికి నోచుకోలేదని అంటూ ఉంటారు.

ఇక రామ జన్మభూమి ఉద్యమంతో మోహన్​ ప్రతాప్​ మిశ్రాకు 3 దశాబ్దాల అనుబంధం ఉంది. 1990 నుంచి అనేక మంది కరసేవకులకు ఆయన ఆశ్రయం కల్పించారు.

"నా జీవితంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని చూస్తాను అని అనుకోలేదు. ఇది నా అదృష్టం," అని భావోద్వేగానికి లోనయ్యారు మోహన్​ ప్రతాప్​ మిశ్రా.

మరోవైపు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే.. అక్కడ కొత్తగా నిర్మించిన విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. ఇక 22న ప్రధాని నరేంద్ర మోదీ.. అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభిస్తారు.

తదుపరి వ్యాసం