తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  అక్క- తమ్ముడి దారుణ హత్య.. ఆసుపత్రిలో తల్లి- అసలేం జరిగింది?

అక్క- తమ్ముడి దారుణ హత్య.. ఆసుపత్రిలో తల్లి- అసలేం జరిగింది?

Sharath Chitturi HT Telugu

18 June 2022, 11:49 IST

google News
  • ఆమె వయస్సు 17. ఆమె తమ్ముడి వయస్సు 14. ఇంకా ప్రపంచాన్నే చూడని వయస్సు అది. అప్పుడే వారు ప్రాణాలు వీడారు. వారిని ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు. వారి తల్లిని సైతం కత్తితో పొడిచాడు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన ఝార్ఖండ్​లో జరిగింది.

17ఏళ్ల బాలిక దారుణ హత్య.. ఆ ‘రిలేషనే’ కారణమా?
17ఏళ్ల బాలిక దారుణ హత్య.. ఆ ‘రిలేషనే’ కారణమా? (HT Telugu)

17ఏళ్ల బాలిక దారుణ హత్య.. ఆ ‘రిలేషనే’ కారణమా?

ఝార్ఖండ్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 17ఏళ్ల బాలిక, ఆమె సోదరుడు దారుణ హత్యకు గురయ్యారు. శరీరంపై కత్తిపోటు గాయాలతో ఆమె తల్లి కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

నిందితుడితో బాలిక రిలేషన్​..?

రాంచీ జిల్లాలోని జనక్​ నగర్​లో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. మృతులు శ్వేత సింగ్​, ప్రవీణ్​ కుమార్​ సింగ్​(14)లు.. తల్లితో కలిసి పంద్రా అనే ప్రాంతంలో నివాసముంటున్నారు. కాగా కత్తి దాడిలో అక్కాతమ్ముళ్లు మరణించారు. తల్లిని రాంచీలోని రిమ్స్​ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

శ్వేత తండ్రి.. విదేశాల్లో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలంలో దాడికి వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తును ముమ్మరం చేశారు.

కాగా.. ఈ ఘటన ఓ వ్యక్తి చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. శ్వేతకు అతడి మధ్య రిలేషన్​ ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరింత దర్యాప్తు చేపట్టి.. అసలు నిజాలను కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

నిందితుడిని గుర్తించేందుకు ప్రస్తుతం పోలీసులు తగిన చర్యలు చేపట్టారు.

టాపిక్

తదుపరి వ్యాసం