తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Crime: జర్నలిస్టులమంటూ పరిచయం.. లైంగిక దాడికి పాల్పడి దోచుకెళ్లారు….

Crime: జర్నలిస్టులమంటూ పరిచయం.. లైంగిక దాడికి పాల్పడి దోచుకెళ్లారు….

HT Telugu Desk HT Telugu

15 June 2022, 12:36 IST

google News
    • విశాఖలో దారుణానికి ఒడిగట్టారు ఇద్దరు వ్యక్తులు. ఇందుకోసం మీడియాను వాడుకున్నారు. జర్నలిస్టులమని బెదిరించి ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడటమే కాక... నగదును దోచుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు… ఇద్దరిని అరెస్ట్ చేశారు.
విశాఖలో పాత్రికేయులమంటూ దోపిడీ
విశాఖలో పాత్రికేయులమంటూ దోపిడీ

విశాఖలో పాత్రికేయులమంటూ దోపిడీ

ఓ ఇంట్లోకి దర్జాగా వెళ్లారు ఇద్దరు వ్యక్తులు.... జర్నలిస్టులమని చెప్పారు... ! ఓ సంస్థలో పని చేస్తున్నామంటూ ఐడీ కార్డులు కూడా చూపించారు. అంతలోనే ఆమె మంచినీళ్లను ఇద్దామని అనుకుని లోపలికి వెళ్లింది...! సీన్ కట్ చేస్తే లోపలికి వెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దాన్ని కెమెరాలో చిత్రీకరించి బెదిరించారు. ఆమె వద్ద ఉన్న 2 బంగారు ఉంగరాలతో పాటు ఐదు వేల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన విశాఖ నగరంలోని పెందుర్తి పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.

కెమెరాలో రికార్డ్ చేసి…

పెందుర్తి పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లోకి కుమార్ అనే వ్యక్తి వెళ్లాడు. అక్కడున్న మహిళతో తాను టీవీ 10 ఛానల్‌లో పనిచేస్తున్న జర్నలిస్ట్ అని పరిచయం చేసుకున్నాడు. ఆమె మంచినీరు తీసుకువచ్చేలోపు ఆమె వెనకాలే వెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దాన్ని కెమెరాలో రికార్డు చేసి బెదిరించాడు. ఆమె వద్ద ఉన్న 2 బంగారు ఉంగరాలు, రూ. 5 వేల నగదు తీసుకొని వెళ్లిపోయాడు. బాధిత మహిళ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

నిందితులు అరెస్ట్...

సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించారు పోలీసులు. కంచరపాలెంకు చెందిన కుమార్‌, జ్ఞానాపురానికి చెందిన జి.శేఖర్‌లు ఈ నేరానికి పాల్పడినట్లుగా గుర్తించి, అరెస్ట్ చేశారు. సంబంధిత ఛానల్ ను విషయంపై ఆరా తీశారు. 6 నెలల క్రితమే వీరు చేరినట్లు చెప్పారు. వీరిద్దరిపై రౌడీ షీట్‌ కూడా ఉనట్లు తేల్చారు పోలీసులు. కుమార్‌ ఇంట్లోకి వెళ్లగా, శేఖర్‌ మాత్రం బయట ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. నిందితులపై పలు రకాల కేసులు కూడా ఉన్నట్లు బయటపడింది.

టాపిక్

తదుపరి వ్యాసం