Crime : నవదంపతుల దారుణ హత్య.. కులాంతర వివాహమే కారణమా?
14 June 2022, 12:35 IST
- వారిద్దరు ఇటీవలే కులాంతర వివాహం చేసుకున్నారు. మహిళ సోదరుడు వారిద్దరిని పిలిపించాడు. మరో బంధువుతో కలిసి నవదంపతులను చంపేశాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
నవదంపతుల దారుణ హత్య.. కులాంతర వివాహమే కారణమా? (HT Telugu)
నవదంపతుల దారుణ హత్య.. కులాంతర వివాహమే కారణమా?
తమిళనాడులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే.. కులాంతర వివాహం చేసుకున్న దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ వార్త కుంభకోణంలో తీవ్ర కలకలం సృష్టించింది.
కారణం అదే..!
పోలీసుల కథనం ప్రకారం.. ఆ మహిళ.. తన బంధువుతో రిలేషన్లో ఉండేది. కానీ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఫలితంగా ఆమెపై ఆ బంధువు కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆ మహిళ సోదరుడు, ఆ బంధువు.. నవదంపతుల హత్యకు పాల్పడ్డారు.
కలవాలని చెప్పి.. ఆ దంపతులను ఓ ప్రాంతానికి పిలిపించారు. అక్కడే వారి హత్యకు స్కెచ్ వేశారు.
ఈ ఘటనలో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.
కాగా.. ఇది పరువు హత్య కాదని పోలీసులు స్పష్టం చేశారు.
టాపిక్