professor Saibaba case: ప్రొఫెసర్ సాయిబాబా కేసును మళ్లీ విచారించండి: సుప్రీంకోర్టు
19 April 2023, 15:54 IST
professor Saibaba case: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా (professor Saibaba) కు నిషేధిత మావోయిస్టు సంస్థతో సంబంధాలున్న ఆరోపణలకు సంబంధించిన కేసును మరోసారి విచారించాలని సుప్రీంకోర్టు బొంబాయి హైకోర్టును ఆదేశించింది.
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా
professor Saibaba case: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా (professor Saibaba) కు నిషేధిత మావోయిస్టు (Maoists) సంస్థతో సంబంధాలున్న ఆరోపణలకు సంబంధించి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (Unlawful Activities (Prevention) Act - UAPA) కింద నమోదైన కేసును పునర్విచారించాలని సుప్రీంకోర్టు బొంబాయి హైకోర్టు (Bombay High Court) ను ఆదేశించింది. ఈ కేసులో ప్రొఫెసర్ సాయిబాబా (professor Saibaba) సహా ఇతరులను నిర్దోషులుగా పేర్కొంటూ బొంబాయి హై కోర్టు (Bombay High Court) 2022 అక్టోబర్ 14న ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన బెట్టింది.
professor Saibaba case: హైకోర్టు తీర్పును సవాలు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం
నిషేధిత మావోయిస్టు సంస్థతో సంబంధాలున్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా (professor Saibaba) ను బొంబాయి హైకోర్టు (Bombay High Court) నిర్దోషిగా ప్రకటించడాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court) లో సవాలు చేసింది. ఆ పిటిషన్ ను బుధవారం సుప్రీంకోర్టులో జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ ల ధర్మాసనం విచారించింది. అనంతరం, ఈ కేసును మళ్లీ విచారించాలని బొంబాయి హై కోర్టును ఆదేశించింది.
professor Saibaba case: మరో ధర్మాసనం ముందుకు..
ప్రొఫెసర్ సాయిబాబా (professor Saibaba) ను నిర్దోషిగా పేర్కొంటూ బొంబాయి హైకోర్టు (Bombay High Court) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన బెట్టింది. కేసును మళ్లీ విచారించాలని బొంబాయి హైకోర్టును ఆదేశించింది. అయితే, గతంలో విచారించిన ధర్మాసనాన్ని కాకుండా, ఈ కేసు పునర్విచారణకు మరో ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని బొంబాయి హైకోర్టు (Bombay High Court) కు సూచించింది. గతంలో ఈ కేసును విచారించిన ధర్మాసనం (bench) ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చి, తీర్పు వెలువరించినందున, మరో ధర్మాసనానికి ఈ కేసు పునర్విచారణను అప్పగించాలని స్పష్టం చేసింది. ఆ ధర్మాసనం నాలుగు నెలల్లోగా ఈ కేసు విచారణను ముగించాలని సూచించింది.