Professor Saibaba acquittal: ప్రొ. సాయిబాబా విడుదలపై రేపు సుప్రీంలో విచారణ-maha govt moves sc against acquittal of former du professor saibaba in maoist link case hearing tomorrow ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Professor Saibaba Acquittal: ప్రొ. సాయిబాబా విడుదలపై రేపు సుప్రీంలో విచారణ

Professor Saibaba acquittal: ప్రొ. సాయిబాబా విడుదలపై రేపు సుప్రీంలో విచారణ

HT Telugu Desk HT Telugu
Oct 14, 2022 08:44 PM IST

Professor Saibaba acquittal: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ను నిర్దోషిగా పేర్కొంటూ బొంబాయి హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో శనివారం విచారణ జరగనుంది.

<p>ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా</p>
ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా

Professor Saibaba acquittal: మవోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై జైలు శిక్షఅనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు ఊరట కల్పిస్తూ బొంబాయి హైకోర్టు తీర్పునిచ్చిన కొన్ని గంటల్లోపే ఈ తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

Professor Saibaba acquittal: తక్షణమే విడుదల చేయాలి

మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలను కొట్టివేసిన బొంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్ ప్రొఫెసర్ సాయిబాబా ను తక్షణమే విడుదల చేయాలని శుక్రవారం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది. ఈ ఆదేశాలు వెలువడిన కొన్ని గంటల్లోపే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

Professor Saibaba acquittal: స్టే ఇవ్వండి..

బొంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై వెంటనే స్టే ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ అభ్యర్థనను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. అయితే, బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారణ జరిపేందుకు అనుమతినివ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది.

Professor Saibaba acquittal: శనివారం విచారణ..

ఆ అభ్యర్థనను సుప్రీంకోర్టు పరిశీలనలోకి తీసుకుంది. శనివారం అయినప్పటికీ.. అసాధారణ కేసుగా పరిగణనలోకి తీసుకుని శనివారం విచారణ జరపడానికి అనుమతించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం త్రివేదీల ధర్మాసనం ఈ కేసును శనివారం విచారించనుంది.

Professor Saibaba acquittal: 2014 నుంచి..

ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు ఐదుగురిని నిర్దోషులుగా పేర్కొంటూ బొంబాయి హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(Unlawful Activities (Prevention) Act -UAPA) కింద వారికి యావజ్జీవ శిక్ష విధిస్తూ గడ్చిరోలి లోని విచారణ కోర్టు 2017లో తీర్పునిచ్చింది. అంతకుముందు, 2014లోనే వారిని అరెస్ట్ చేశారు.

Whats_app_banner