Mukaab : ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భవనం- ఖర్చు రూ. 42,05,11,19,00,000!
26 October 2024, 12:09 IST
- సౌదీ అరేబియా రియాద్‌లో 400 మీటర్ల క్యూబ్ భవనాన్ని నిర్మిస్తోంది. దీని పేరు ముకాబ్. పనులు పూర్తైన తర్వాత ఈ ముకాబ్.. ప్రపంచంలోనే అతిపెద్ద భవనంగా నిలిచిపోతుంది. పూర్తి వివరాలు..
సౌదీ అరేబియాలో ముకాబ్..
ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్‌ని కట్టేందుకు సౌదీ అరేబియా రెడీ అవుతోంది. ఈ మేరకు 400 మీటర్ల ఎత్తుండే ‘ముకాబ్’ భవన నిర్మాణాన్ని ప్రారంభించింది. క్యూబ్ ఆకారంలో ఉండే ఈ భవనంలో అత్యాధునిక వసతులు ఉండనున్నాయి. రాజధాని నగరం రియాద్‌లో ఉండే ఈ భవనం.. రెండు మిలియన్ చదరపు మీటర్ల ఫ్లోర్స్పేస్ను కలిగి ఉంటుంది. అంతేకాదు, న్యూయార్క్‌లోని ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌కు ఇరవై రెట్లు ఎక్కువగా ఉంటుంది! ముకాబ్ మొత్తం ఖర్చు ఎంతో తెలిస్తే నోరెళ్ల బెడతారు!
న్యూ మురబ్బా జిల్లాలో..
ముకాబ్ని సుమారు 50 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని (సుమారు రూ. 42,05,11,19,00,000), న్యూ మురబ్బా అని పిలిచే కొత్త జిల్లాకు ఇది కేంద్ర బిందువుగా పనిచేస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ విస్తారమైన ప్రాంతంలో 25 మిలియన్ చదరపు మీటర్ల ఫ్లోర్‌స్పేస్ ఉంటుంది. ఇందులో 104,000 గృహాలు ఉంటాయి. రిటైల్, కార్పొరేట్, సాంస్కృతిక అనుభవాల ప్రత్యేక మిశ్రమాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్‌ని నిర్మిస్తున్నారు. ఇది వ్యాపారానికి కేంద్రంగా కూడా మారుతుంది.
ప్రీమియం ఆతిథ్యానికి ఒక విజన్..
"ప్రీమియం హాస్పిటాలిటీ డెస్టినేషన్"గా డిజైన్ చేసిన ముకాబ్ ఒక సెంట్రల్ అట్రియం స్పేస్‌ను కలిగి ఉంటుంది. ఇది సందర్శకులు, నివాసితులకు అనుభవాన్ని పెంచుతుంది. ఈ భవనం బహుముఖ రూపకల్పన వివిధ రంగాలకు సేవలు అందిస్తుంది. ఇది స్థానిక- అంతర్జాతీయ సందర్శకులకు కేంద్ర బిందువుగా మారుతుందని భావిస్తున్నారు.
దేశ పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (పీఐఎఫ్)లో కీలక పాత్ర పోషిస్తున్న సౌదీకి చెందిన న్యూ మురబ్బా డెవలప్మెంట్ కంపెనీ (ఎన్ఎండీసీ) ఈ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోంది. సౌదీ అరేబియా తన ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడానికి, సృజనాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి విస్తృత ప్రయత్నాల్లో భాగంగా ఈ చొరవ తీసుకుంది.
ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వారసత్వం..
భూమిని సరిగ్గా వాడుకోదన్న కారణంతో క్యూబ్ ఆకారంలో పెద్దగా భవనాలు కనిపించవు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే అలవాటు సౌదీ అరేబియాకు ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన ఆకాశహర్మ్యంగా ఉండాలని భావించిన జెడ్డా టవర్‌తో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సౌదీ గతంలో చేపట్టింది. కానీ దీన్ని 2018లో నిలిపివేశారు.
ఎడారిలో 170 కిలోమీటర్ల మేర విస్తరించిన మిర్రర్ సిటీగా రూపుదిద్దుకున్న ఈ లైన్‌ని ప్రస్తుతానికి కేవలం 2.4 కిలోమీటర్లకు కుదించారు.
సృజనాత్మకత సుస్థిరత కోసం..
న్యూ మురబ్బా జిల్లా "సాంకేతికత, సృజనాత్మకత, సుస్థిరతను నిరంతరాయంగా మిళితం చేస్తుంది," అని భావిస్తున్నారు. దాని అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఈ అభివృద్ధి “ప్రకృతి సౌందర్యం, ప్రామాణిక సంస్కృతికి అనుగుణంగా పురోగతి, సృజనాత్మకత, వ్యవస్థాపకత”కు కేంద్రంగా ఉంటుంది.
మరి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద భనవంపై మీ ఒపీనియన్ ఏంటి?