తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Robbery : యాక్షన్​ సినిమా రేంజ్​లో 'ఛేజింగ్​'- రూ. 3.2కోట్లు దోపిడీ..!

Robbery : యాక్షన్​ సినిమా రేంజ్​లో 'ఛేజింగ్​'- రూ. 3.2కోట్లు దోపిడీ..!

Sharath Chitturi HT Telugu

27 August 2022, 10:29 IST

google News
    • Robbery in Pune : రూ. 3.2కోట్ల నగదుతో వారిద్దరు కారులో బయలుదేరారు. వారి వాహనాన్ని నాలుగు బైక్​లు వెంబడించాయి. అది గమనించి.. వారి నుంచి తప్పించుకునేందుకు ఆ ఇద్దరు ప్రయత్నించారు. మహారాష్ట్రలో యాక్షన్​ సినిమా స్టైల్​లో జరిగిన ఛేజింగ్​లో.. చివరికి దుండగులు ఆ నగదును దోచుకుని పారిపోయారు.
యాక్షన్​ సినిమా రేంజ్​లో 'ఛేజింగ్​'- రూ. 3.2కోట్లు దోపిడీ..!
యాక్షన్​ సినిమా రేంజ్​లో 'ఛేజింగ్​'- రూ. 3.2కోట్లు దోపిడీ..! (HT)

యాక్షన్​ సినిమా రేంజ్​లో 'ఛేజింగ్​'- రూ. 3.2కోట్లు దోపిడీ..!

Robbery in Pune : మహారాష్ట్రలో.. యాక్షన్​ సినిమాను తలపించే రీతిలో ఓ ఛేజింగ్​ సన్నివేశం జరిగింది. కొందరు దుండగులు.. ఓ వాహనాన్ని అడ్డుకుని రూ. 3.2కోట్ల నగదును దోచుకున్నారు. అసలేం జరిగిందంటే..

ఛేజింగ్​.. ఛేజింగ్​..

భవేష్​ కుమార్​, విజయ్​భాయ్​ అనే ఇద్దరు.. రూ. 3.2కోట్లతో ఓ కారులో గురువారం రాత్రి బయలుదేరారు. పుణె జిల్లాలోని ఇందాపూర్​ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో.. వారి వాహనాన్ని మరో నాలుగు బైక్​లు వెంబడించాయి. స్పీడ్​ బ్రేకర్​ దగ్గర భవేష్​ కుమార్​ వాహనం స్లో అయ్యింది. అదును చూసుకున్న దుండగులు.. చేతుల్లో రాడ్లు పట్టుకుని వాహనంవైపు పరిగెత్తారు. వాహనాన్ని నిలిపివేసేందుకు ప్రయత్నించారు.

దుండగులను గమనించిన భవేష్​ కుమార్​, విజయ్​భాయ్​.. వాహనం స్పీడును ఒక్కసారిగా పెంచి అక్కడి నుంచి తప్పించుకున్నారు. దుండగులు మాత్రం వారి వాహనాన్ని వెంబడించారు.

Pune crime news : సీన్​.. పుణె- సొలాపూర్​ హైవేపైకి చేరింది. యాక్షన్​ సినిమాను తలపించే రీతిలో ఛేంజింగ్​ జరిగింది. బైక్​లు వెంబడిస్తుండగా.. దుండగుల నుంచి తప్పించుకునేందుకు వాహనంలోని ఇద్దరు తీవ్రంగా ప్రయత్నించారు. సినిమా స్టైల్​ డ్రామా కొంతసేపు నడిచింది. వాహనంపై దుండగులు కాల్పులు కూడా జరిపారు.

చివరికి.. బైక్​ మీద వచ్చిన దుండగులు కారును పట్టుకున్నారు. వాహనాన్ని అడ్డగించి.. లోపల ఉన్న ఇద్దరిని బయటకు లాగేశారు. ఆ ఇద్దరిని చితకబాది.. వారి వద్ద ఉన్న డబ్బులను దోచుకుని అక్కడి నుంచి తప్పించుకున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

అయితే.. ఈ భవేష్​ కుమార్​, విజయ్​భాయ్​ ఎవరు? రూ. 3.2కోట్ల భారీ నగదును వారు వాహనంలో ఎందుకు తీసుకెళుతున్నారు? ఎక్కడికి తీసుకెళుతున్నారు? వంటి ప్రశ్నలకు జవాబు లభించలేదు.

కాగా.. వారి వద్ద ఉన్న డబ్బు కూడా.. అక్రమ నగదే అని పోలీసులు అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది.

తదుపరి వ్యాసం