Hamas terrorists : పిల్లలకు జోలపాటలు పాడుతున్న హమాస్ ఉగ్రవాదులు.. వీడియో వైరల్!
14 October 2023, 11:15 IST
- Hamas terrorists : హమాస్ ఉగ్రవాదులు.. తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. పిల్లలకు ఉగ్రవాదులు జోలపాటలు పాడుతుండటం, మంచి నీరు ఇస్తుండటం వంటివి ఆ వీడియోలో ఉన్నాయి.
పిల్లలకు జోలపాటలు పాడుతున్న హమాస్ ఉగ్రవాదులు..
Hamas terrorists latest news : ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు చేసిన దండయాత్ర.. ప్రపంచ దేశాలను షాక్‌కు గురిచేసింది. అనేక దేశాలు.. హమాస్ బృందానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఉగ్రవాదులను విడిచిపెట్టకూడదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇంతటి వ్యతిరేకత మధ్య.. హమాస్ బృందం తాజగా ఒక వీడియో విడుదల చేసింది. 'మేము అంత చెడ్డవాళ్లము కాదు,' అని నిరూపించుకోవడానికే ఈ వీడియోను రిలీజ్ చేసినట్టు కనిపిస్తోంది.
వీడియోలో ఏముందంటే..
గత శనివారం ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్.. అనేక మంది ఇజ్రాయెలీలను బంధీగా చేసింది. బంధీల్లోని కొందరు చిన్న పిల్లలు.. తాజాగా విడుదల చేసిన వీడియోలో కనిపిస్తున్నారు. పిల్లలను ఎత్తుకున్న ఉగ్రవాదులు.. వారికి జోల పాటలు పడుతున్నారు, పాల సీసాలు ఇస్తున్నారు, భోజనం తినిపిస్తున్నారు.
ఒక చేతిలో ఇవి చేస్తుంటే.. ఇంకో చేతిలో ఏకే సిరీస్ రైఫిళ్లు ఉండటం గమనార్హం.
Israel Hamas war : ఈ వీడియోలో.. హమాస్ ఉగ్రవాదుల ఫేస్‌లు బ్లర్ చేసి ఉన్నాయి. గాయమైన పిల్లలకు ఉగ్రవాదులు.. బ్యాండేజ్‌లు కూడా కడుతుండటం వీడియోలో చూడవచ్చు. మంచి నీళ్లు కూడా ఇస్తున్నారు.
ఈ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. హమాస్ చర్యలను ఇజ్రాయెల్ మరోమారు ఖండించింది.
Israel war latest news : "పిల్లల గాయాలను చూడొచ్చు. వారి ఏడుపును వినొచ్చు. సొంత ఇంట్లో వీరు బంధీలుగా అయ్యారు. వీరి తల్లిదండ్రుల మృతదేహాలు పక్క గదిలో పడి ఉన్నాయి. హమాస్ ఉగ్రవాదులతో వీరు పడుతున్న భయాన్ని చూడొచ్చు. ఈ ఉగ్రవాదులను మేము ఓడిస్తాము," అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్.. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి :
గాజా గజగజ..
Hamas Terrorists viral video : ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం మధ్య గాజా చితికిపోతోంది. మరీ ముఖ్యంగా గాజా ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. గాజాను పూర్తిగా ఖాళీ చేయాలని అక్కడి ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. త్వరలోనే ఆ ప్రాంతంలో కనీవినీ ఎరుగని రీతిలో దాడులు చేస్తామని బెదిరించింది. ఈ పరిస్థితుల మధ్య గాజా ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. 'బతికి ఉండటం కన్నా.. చావడం మేలు' అని అనుకుంటూ.. చాలా మంది కాలి నడకన గాజాను విడిచివెళ్లిపోతున్నారు. వీరి భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోయింది.
మరోవైపు లెబనాన్ సరిహద్దుల్లో కూడా దాడులు చేపట్టిన ఇజ్రాయెల్. ఈ ఘటనల్లో అంతర్జాతీయ మీడియా సంస్థకు చెందిన ఓ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. ఇతర జర్నలిస్టులు గాయపడ్డారు.