తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Caste Census : రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​లో బిహార్​ తరహా కుల గణన!

Caste census : రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​లో బిహార్​ తరహా కుల గణన!

Sharath Chitturi HT Telugu

07 October 2023, 8:51 IST

google News
    • Caste census : దేశవ్యాప్తంగా.. కుల గణనపై చర్చ పెరుగుతోంది. ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్​లోనూ బిహార్​ తరహా కుల గణన ప్రక్రియ చేపట్టాలని కాంగ్రెస్​ ప్రభుత్వం భావిస్తోంది.
రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​లో బిహార్​ తరహా కుల గణన!
రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​లో బిహార్​ తరహా కుల గణన! (HT_PRINT)

రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​లో బిహార్​ తరహా కుల గణన!

Caste census : బిహార్​లో కుల గణన హిట్​ అయ్యింది! ఈ నేపథ్యంలో రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​లోను కుల గణనను నిర్వహించేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు రాజస్థాన్​ సీఎం అశోక్​ గహ్లోత్​, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు వ్యాఖ్యానించారు.

రాజస్థాన్​లో..

కుల గణనపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు రాజస్థాన్​ సీఎం గహ్లోత్​.

"రాయ్​పూర్​లో జరిగిన కాంగ్రెస్​ సభలో కుల గణనను రాహుల్​ గాంధీ ప్రస్తావించారు. రాజస్థాన్​లో కూడా దీనిని మేము అమలు చేస్తాము. బిహార్​ తరహాలోనే కుల గణన ప్రక్రియ చేపడతాము. జనాభా తగ్గట్టు ప్రజలకు సౌకర్యాలు అందాలి. బిహార్​ తరహా కుల గణన చేపట్టాలని అధికారులకు ఆదేశాలిస్తాము," అని గహ్లోత్​ తెలిపారు.

Caste census in Rajasthan : "అందరికి సామాజిక భద్రత కావాలంటే.. కుల గణన చేపట్టడం చాలా ముఖ్యం. దేశంలో అనే కులాలు ఉన్నాయి. కులాల్లో ఎంత జనాభా ఉంది? అన్నది తెలుసుకుంటేనే ప్రత్యేక పథకాలు విడుదల చేయవచ్చు," అని అశోక్​ గహ్లోత్​ స్పష్టం చేశారు.

ఛత్తీస్​గఢ్​లో..

ఛత్తీస్​గఢ్​లోనూ కుల గణన ప్రక్రయ చేపట్టే యోచనలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ప్రియాంక గాంధీ పలు వ్యాఖ్యలు చేశారు.

"ఛత్తీస్​గఢ్​లో కాంగ్రెస్​ తిరిగి ప్రభుత్వంలోకి వస్తే.. బిహార్​ తరహా కుల గణనను చేపడతాము. ఛత్తీస్​గఢ్​తో నా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. సమయంతోనే నమ్మకం పెరుగుతుంది. మళ్లీ కాంగ్రెస్​ను గెలిపిస్తే.. కుల గణన చేపడతాము," అని ప్రియాంక గాంధీ అన్నారు.

Caste census in Chhattisgarh : ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్​లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక వచ్చే ఏడాది లోక్​సభ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వంపై ఈ కుల గణన అస్త్రానికి పదును పెడుతోంది విపక్ష ఇండియా బృందం.

కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.. ఇంకో అడుగు ముందుకేసి, ఇండియా బృందం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. దేశవ్యాప్తంగా కుల గణన ప్రక్రియ చేపడతామని హామీనిచ్చారు.

బిహార్​లో పరిస్థితి ఇలా..

Bihar caste census : బిహార్​లో కుల గణన డేటాను ఇటీవలే ప్రకటించింది నితీశ్​ కుమార్​ ప్రభుత్వం. రాష్ట్ర జనాభాలో 63శాతం మంది ఓబీసీలు- ఈబీసీలే ఉన్నారని సర్వేలో తేలింది. బిహార్​ జనాభా సుమారు 13.07 కోట్లు! ఈ జనాభాలో ఈబీసీ (అత్యంత వెనకబడిన వర్గాలు) వాటా 36శాతం. ఓబీసీల వాటా 27.13శాతం. 19.7శాతం మంది ఎస్​సీలు 1.7శాతం మంది ఎస్​టీలు ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం