తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Caste Census : కుల గణనపై కేంద్రం కీలక వ్యాఖ్యలు.. బిహార్​ ప్రభుత్వానికి షాక్​!

Caste census : కుల గణనపై కేంద్రం కీలక వ్యాఖ్యలు.. బిహార్​ ప్రభుత్వానికి షాక్​!

Sharath Chitturi HT Telugu

29 August 2023, 5:32 IST

google News
  • Caste census : జనాభా లెక్కలు నిర్వహించే అధికారం తమకు మాత్రమే ఉందని, మరే ఇతర వ్యవస్థకు లేదని సుప్రీంకోర్టుకు వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. బిహార్​ కుల గణన వ్యవహారం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

కుల గణనపై కేంద్రం కీలక వ్యాఖ్యలు..
కుల గణనపై కేంద్రం కీలక వ్యాఖ్యలు.. (PTI)

కుల గణనపై కేంద్రం కీలక వ్యాఖ్యలు..

Caste census in India : దేశంలో చర్చనీయాంశంగా మారిన కుల గణనపై కీలక వ్యాఖ్యలు చేసింది కేంద్ర ప్రభుత్వం. జనాభాను లెక్కించే ప్రక్రియను.. కేంద్రం తప్ప మరే ఇతర వ్యవస్థ కూడా చేపట్టకూడదని, చేపట్టలేదని స్పష్టం చేసింది. 1948 జనగణన చట్టం కూడా ఇదే చెబుతోందని తేల్చిచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్​ను దాఖలు చేసింది.

బిహార్​ ప్రభుత్వానికి షాక్​..!

సుప్రీంకోర్టు ఎదుట కేంద్రం తాజాగా చేసిన వ్యాఖ్యలతో బిహార్​ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది! బిహార్​లో​ కులగణన చేపట్టాలని నితీశ్​ కుమార్​ ప్రభుత్వం గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో.. కులగణనకు సంబంధించి ఆగస్ట్​ 6న ఓ సర్వే చేపట్టింది. ఇదే విషయాన్ని గత విచారణలో అత్యున్నత న్యాయస్థానానికి వెల్లడించింది బిహార్​ ప్రభుత్వం.

Bihar caste census : కానీ జనాభా లెక్కలను తాము మాత్రమే చేపట్టాలని కేంద్రం చేసిన వ్యాఖ్యలు తాజాగా చర్చలకు దారితీసింది.

"ఎస్​సీ,ఎస్​టీ, ఓబీసీల అభ్యున్నతికి కావాల్సిన చర్యలు చేపట్టేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. రాజ్యాంగం సూచించిన దానిలో, చట్టాలను అనుసరించి కేంద్రం చర్యలు చేపడుతుంది. కానీ కులగణనతో పాటు జనాభా లెక్కలను నిర్వహించే అధికారం ఒక్క కేంద్రానికే ఉంది," అని అఫిడవిట్​లో పేర్కొందని తెలుస్తోంది.

కులగణన నిర్వహించాలని బిహార్​ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకించారు. ఈ మేరకు పట్నా హైకోర్టుకు వెళ్లారు. కానీ వారికి అక్కడ చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వం.. కులగణన చేపట్టవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో.. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

Centre on caste census : "జనగణనను నిర్వహించే హక్కు కేవలం కేంద్రానికే ఉందని రాజ్యాంగంలో ఉంది. కానీ ప్రస్తుతం.. ఒక్క గెజిట్​ నోటిఫికేషన్​ను జారీ చేసి, కేంద్రం వద్ద ఉన్న అధికారాలను లాగేసుకోవాలని బిహార్​ ప్రభుత్వం చూస్తోంది," అని పిటిషనర్లు పేర్కొన్నారు.

ఆయా పిటిషన్లపై విచారణ జరుపుతూ వస్తోంది సర్వోన్నత న్యాయస్థానం. తాజాగా.. వీటిపై తమ సమాధానంగా అఫిడవిట్​ను దాఖలు చేసింది కేంద్రం.

caste census in Bihar : మరోవైపు.. బిహార్​లోని 12.70కోట్ల మంది జనాభాకు కులగణన జరపాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. 38 జిల్లాల్లో మొత్తం మీద 2.58కోట్ల నివాసాలు.. ఈ కులగణనలో పాల్గొనాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం