తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Caste-based Census: బిహార్ లో కుల గణన ప్రారంభం

Caste-based census: బిహార్ లో కుల గణన ప్రారంభం

HT Telugu Desk HT Telugu

08 January 2024, 21:39 IST

google News
  • బిహార్ లో కులం ఆధారిత జన గణన ప్రారంభమైంది. తొలి దశ కుల గణన(caste-based census) శనివారం నుంచి ప్రారంభమైంది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (ANI)

ప్రతీకాత్మక చిత్రం

Caste-based census: బిహార్ లో కుల గణన(Caste-based census:) ప్రారంభమైంది. రాష్ట్రంలో కులాల వారీగా జనాభాను లెక్కించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 జిల్లాల్లో ఈ కుల గణనను రెండు దశల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

First phase Caste-based census: జనవరి 21 వరకు..

బిహార్ లో తొలి దశ కులాలవారీ జనాభా లెక్కింపు జనవరి 7వ తేదీ నుంచి జనవరి 21వ తేదీ వరకు జరుగుతుంది. పేదలకు అభివృద్ధి ప్రయోజనాలు అందించడానికి వీలుగా శాస్త్రీయ విధానాల ద్వారా కుల గణన (Caste-based census) చేపట్టినట్లు ఆర్జేడీ నేత, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తెలిపారు. పేదలకు బీజేపీ వ్యతిరేకమని, అందువల్ల ఈ కుల గణన జరగకుండా ఆపాలని ప్రయత్నించిందని ఆరోపించారు. బీజేపీవి పేదల వ్యతిరేక విధానాలని ఆరోపించారు. శాస్త్రీయంగా రూపొందించిన కుల గణన (Caste-based census) నివేదిక ఆధారంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని, తదనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని తేజస్వీ వివరించారు.

2nd phase Caste-based census: ఏప్రిల్ 1 నుంచి..

కుల గణన (Caste-based census) రెండో దశ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు జరుగుతుంది. మొత్తం ఈ ప్రక్రియను మే 31, 2023 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని కులాలు, ఉప కులాలు, వాటి జనాభా, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను ఈ కుల గణన ద్వారా గణించనున్నారు. రాష్ట్రంలో కుల గణన (Caste-based census) చేపట్టాలని గత సంవత్సరం జూన్ లో నిర్ణయించారు. జనగణనలో భాగంగా కుల గణన చేపట్టలేమని కేంద్రం స్పష్టం చేసిన తరువాత బిహార్ కేబినెట్ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. బిహార్ జనాభా సుమారు 12.70 కోట్లు. రాష్ట్రంలో సుమారు 2.58 కోట్ల కుటుంబాలున్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం