Rain alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. అక్కడ అతి భారీ వర్షాలు!
19 August 2022, 13:56 IST
- Rain alert in India : బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ఏర్పడటం.. 15 రోజుల వ్యవధిలో ఇది మూడోసారి.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. అక్కడ అతి భారీ వర్షాలు!
Rain alert in India : బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఇది ఈశాన్య, తూర్పు- మధ్య బంగాళాఖాతం, బంగ్లాదేశ్, మయన్మార్ తీరం వద్ద కేంద్రీకృతమై ఉంది. శనివారం ఉదయం నాటికి ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది.
"శుక్రవారం ఉదయం 8:30 గంటలకు.. ఒడిశా బాలాసోర్‌కు 250కి.మీల దూరం (తూర్పు-అగ్నేయం)లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది బాలాసోర్- సాగర్ ద్వీపాలను ఈరోజు సాయంత్రానికి దాటే అవకాశం ఉంది. రానున్న ఆరు గంటల్లో.. ఇది వాయువ్యంవైపు ప్రయాణించి మరింత బలపడే అవకాశం ఉంది. రేపు ఉదయానికి అల్పపీడం మరింత తీవ్రరూపం దాల్చవచ్చు. అక్కడి నుంచి ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర్ ఛత్తీస్‌గఢ్, గ్యాంగ్టిక్ పశ్చిమ్ బెంగాల్‌వైపు ప్రయాణించవచ్చు," అన ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది.
Low pressure area in Bay of Bengal : బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం.. గత 15రోజుల్లో ఇది మూడోది. తాజా పరిణామాలతో.. ఒడిశాలోని రాయగడ, జగత్సింగ్పూర్, సుపర్నరేఖ, ఉత్తర భాగంలో భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు ముంచ్చెత్తే ముప్పు కూడా ఉంది.!
కాగా.. ఒడిశాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయ. జగత్సింగ్పూర్లో గత రాత్రి 107ఎంఎంల వర్షపాతం నమోదైంది.
ఒడిశాలో భారీ వర్షాల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల అధికారులకు నోటీసులు జారీ చేసింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.
ఒడిశాలో భారీ వర్షాల కారణంగా.. కింఝార్, బాలాసోర్, భద్రక్, మయూర్భంజ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం.
Rains in Telangana : ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా.. తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.