తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Railway Rules : రైలు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ టీటీఈతో గొడవ పడుతున్నారా?

Railway Rules : రైలు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ టీటీఈతో గొడవ పడుతున్నారా?

Anand Sai HT Telugu

25 August 2024, 18:27 IST

google News
    • Travelling Without Railway Ticket : రైలు టికెట్ లేకుండా కొన్నిసార్లు ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో టీటీఈకి దొరికిపోతాం. దీంతో వారు పెనాల్టీ కట్టాలని చెబుతారు. కొంతమంది కడితే.. మరికొందరేమో కట్టం అని టీటీఈతో గొడవకు దిగుతారు. కానీ ఇది మీకే నష్టం.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో మధ్యతరగతి వారిని భారతీయ రైల్వే వివిధ గమ్యస్థానాలకు ప్రయాణించడానికి చౌక టిక్కెట్లను అందిస్తుంది. భారతీయ రైల్వే సహాయంతో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణిస్తున్నారు. రైలులో ప్రయాణించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ప్రయాణించే ప్రయాణికులు దీనిని పాటించాలి. లేకపోతే మీరు రైల్వేతో జరిమానా, శిక్షకు గురవుతారు. రైల్వేలో అత్యంత ముఖ్యమైన నియమం టిక్కెట్‌తో ప్రయాణించడం. టికెట్ లేని ప్రయాణం నేరం.

ఎవరైనా ప్రయాణికుడు టిక్కెట్టు లేకుండా ప్రయాణిస్తే అతనిపై చర్య తీసుకునే హక్కు టీటీఈ(Traveling Ticket Examiner)కి ఉంది. ఇది కాకుండా టిక్కెట్ లేకుండా ప్రయాణించినందుకు ప్రయాణికుడికి జరిమానా విధించే హక్కు కూడా ఉంటుంది. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఏం టీటీఈ ఏం చేస్తారో చూద్దాం..

జరిమానా

రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు టీటీఈ గుర్తించినట్లయితే జరిమానా విధించవచ్చు. ఈ పెనాల్టీ అనేది రైలు బయలుదేరే స్టేషన్‌ల నుండి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని టీటీఈ గుర్తించిన స్టేషన్‌కు వెళ్లే ఛార్జీగా ఉంటుంది. టికెట్ లేకుండా ప్రయాణిస్తే రూ.250 జరిమానా విధిస్తారు.

కిందకు దించవచ్చు

భారతీయ రైల్వేలో టికెట్ లేకుండా ప్రయాణించినందుకు టీటీఈ జరిమానా విధించవచ్చు. టీటీఈ అనుకుంటే టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికులను రైలు నుండి దింపవచ్చు. ఈ చర్య పూర్తిగా టీటీఈపై ఆధారపడి ఉంటుంది. వారు కోరుకుంటే జరిమానా విధించవచ్చు. ప్రయాణం కొనసాగించడానికి అనుమతించవచ్చు.

ఖాళీ సీటులోకి

జరిమానా విధించిన తర్వాత టీటీఈ ప్రయాణికులను స్లీపర్ లేదా ఏసీ కోచ్ నుండి జనరల్ కోచ్‌కి బదిలీ చేయవచ్చు. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికులను గుర్తిస్తే.. ప్రారంభ స్టేషన్ నుండి ప్రయాణికుడు పట్టుకున్న స్టేషన్ వరకు ఛార్జీలు, జరిమానా వసూలు చేసిన తర్వాత కోచ్‌లో ఏదైనా ఖాళీ సీటులో కూర్చోవచ్చు.

టీటీఈతో వాగ్వాదం వద్దు

రైలులో టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికులపై వివిధ చర్యలు తీసుకునే హక్కు టీటీఈకి ఉంది. జరిమానా విధించడం రైలు నుంచి దిగడం, జనరల్ కంపార్ట్‌మెంట్‌కు బదిలీ చేయడం వంటి చర్యలు తీసుకుంటారు. అందుకే టీటీఈతో గొడవపెట్టుకోకుండా ఉండాలి. టికెట్ లేకుండా ఎందుకు ట్రైన్ ఎక్కాల్సి వచ్చిందో చెప్పాలి. పెనాల్టీ ఎంత విధిస్తారో అంత కట్టేయాలి. వాగ్వాదం పెట్టుకుంటే మీకే నష్టం. నిజానికి ప్రయాణికులు రైల్వే నిబంధనలను పాటించి టిక్కెట్లతో ప్రయాణించడం ద్వారా ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.

తదుపరి వ్యాసం