తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi Disqualification : ఒక్క ఎంపీ సీటు పోతే.. ఇన్ని 'ప్రయోజనాలు' కట్​!

Rahul Gandhi disqualification : ఒక్క ఎంపీ సీటు పోతే.. ఇన్ని 'ప్రయోజనాలు' కట్​!

Sharath Chitturi HT Telugu

25 March 2023, 10:23 IST

  • Rahul Gandhi defamation case : ఎంపీ సీటు కోల్పోవడంతో కాంగ్రెస్​ సీనియర్​ నేత అనేక ప్రయోజనాలను సైతం వదులుకోవాల్సి వస్తోంది. అధికారిక బంగ్లా, జీతంతో పాటు అనేక ప్రయోజనాలకు రాహుల్​ గాంధీ దూరంకానున్నారు.

రాహుల్​ గాంధీ
రాహుల్​ గాంధీ (HT_PRINT/file)

రాహుల్​ గాంధీ

Rahul Gandhi defamation case : రాహుల్​ గాంధీపై అనర్హత వేటు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అంశంపై విపక్షాలు భారీ ఎత్తున్న నిరసనలు చేస్తున్నాయి. ప్రధాని మోదీ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. అయితే.. అనర్హత వేటుతో రాహుల్​ గాంధీ వయనాడ్​ సీటు చెయ్యి జారిపోయింది. అంతేకాదు.. ఎంపీ సీటుతో పాటు వచ్చే అనేక ప్రయోజనాలను సైతం రాహుల్​ గాంధీ కోల్పోయారు.

ఎంపీ సీటు పోతే.. ఇన్ని ప్రయోజనాలు కట్​..!

అనర్హత వేటు కారణంగా రాహుల్​ గాంధీ ముందుగా కోల్పోయేది ప్రభుత్వం ఇచ్చే బంగ్లా. ఢిల్లీ 12 తుగ్లక్​ రోడ్డులోని అధికార నివాసాన్ని రాహుల్​ గాంధీ నెల రోజుల వ్యవధిలో ఖాళీ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Rahul Gandhi disqualified from Lok Sabha : బంగ్లాతో పాటు ఎంపీకి వచ్చే నెలవారీ జీతం రూ. 1లక్ష కూడా రాహుల్​ గాంధీ కోల్పోనున్నారు. జీతంతో పాటు వచ్చే నియోజకవర్గ భత్యం (నెలకు రూ. 70వేలు), కార్యాలయ నిర్వహణ భత్యం (నెలకు రూ. 60వేలు), సెక్రటేరియల్​ అసిస్టెన్స్​ (నెలకు రూ. 40వేలు) వంటి వాటివి కూడా ఇప్పుడు రాహుల్​కు అందవు.

ఫ్రీ నాన్​- ట్రాన్స్​ఫరెబుల్​ ఫస్ట్​ క్లాస్​ ఏసీ లేదా ఎగ్జిక్యూటివ్​ క్లాస్​ పాస్​, 1 ఫస్ట్ ​క్లాస్​, 1 సెకండ్​ క్లాస్​ ఫేర్​, రోడ్డు ప్రయాణంలో లభించే భత్యం​ (కి.మీకి రూ. 16) వంటి ట్రావెలింగ్​ ఆలొవెన్స్​ వంటిని ఇకపై రాహుల్​ గాంధీ మర్చిపోవాల్సి ఉంటుంది.

Rahul gandhi modi surname : భార్య/ భర్త లేదా ఇతరులతో కలిసి ఏడాదిలో 34 సింగిల్​ ఎయిర్​ జర్నీస్​ చేసే వెసులుబాటు ఓ ఎంపీకి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఎంపీ లేకపోయినా.. భార్య/ భర్త ఒక్కరే ఏడాదిలో 8సార్లు విమాన ప్రయాణాలు చేయవచ్చు. ఎంపీలకు అకామడేషన్​ కూడా ఫ్రీగా ఉంటుంది. ఇవేవీ ఇకపై రాహుల్​ గాంధీకి లభించవు!

ఎంపీగా ఎన్నికైన వ్యక్తికి 3 టెలిఫోన్​ కనెక్షన్లు ఇస్తారు. ఈ మూడింట్లో కలిపి ఏడాదికి 1,50,000 కాల్స్​ ఫ్రీగా చేసుకోవచ్చు. అంతేకాకుండా.. ఎంపీలకు 4వేల కిలోలీటర్ల నీరు, 50వేల విద్యుత్​ యూనిట్​లు ఫ్రీ. వైద్య అవసరాల కోసం అత్యవసరంగా తీసుకునే డబ్బును.. ఎంపీలు 60 ఈఎంఐలలో చెల్లించుకునే వెసులుబాటు ఉంటుంది. వీటన్నింటినీ కూడా రాహుల్​ గాంధీ కోల్పోనున్నారు.

అనర్హత వేటు కారణమైన తీర్పు ఇదే..

Rahul Gandhi Surat court : 2019 లోక్​సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో పర్యటించారు రాహుల్​ గాంధీ. కోలర్​లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీపై, మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. "దొంగలందరికి.. మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటోంది?" అని అన్నారు. దేశం నుంచి పారిపోయిన నీరవ్​ మోదీ, లలిత్​ మోదీలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఈ ఇంటి పేరు ఉండటంతో.. రాహుల్​ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో.. 2019లో గుజరాత్​లోని సూరత్​ జిల్లా కోర్టులో రాహుల్​ గాంధీకి వ్యతిరేకంగా పిటిషన్​ దాఖలైంది.

Rahul Gandhi MP status : ఈ వ్యవహారంపై విచారణ పూర్తి చేసిన అనంతరం గురువారం కీలక తీర్పును వెలువరించింది సూరత్​లోని జిల్లా కోర్టు. రాహుల్​ గాంధీని దోషిగా తేలుస్తూ.. రెండేళ్ల జైలు శిక్షను విధించింది. 30 రోజుల బెయిల్​తో పాటు తీర్పును సవాలు చేసేందుకు అవకాశాన్ని ఇచ్చింది. 

తదుపరి వ్యాసం