PM kisan samman nidhi status : మీ ఖాతాలో పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి..
18 June 2024, 11:28 IST
PM kisan samman nidhi : ఇంకొన్ని గంటల్లో.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడుత డబ్బులను విడుదల చేయనున్నారు మోదీ. మరి మీకు ఆ డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..
PM kisan samman nidhi check : పీఎం కిసాన్ పథకం 17వ విడతను ఇంకొన్ని గంటల్లో విడుదల చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వారణాసిలో జరగనున్న కార్యక్రమంలో పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తారు. నేడు వారణాసిలో విడుదల చేయనున్నారు.
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం.. పీఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్‌పై తొలి సంతకం చేశారు మోదీ. ఈ సంతకంతో.. 9.3 కోట్ల మంది రైతులకు రూ.20,000 కోట్ల వరకు అందిస్తామని తెలిపారు. తమది రైతన్న అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వమని ప్రధాని మోదీ అన్నారు. రాబోయే కాలంలో రైతులు, వ్యవసాయ రంగం కోసం మరింత కృషి చేయాలనుకుంటున్నామని వివరించారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ అంటే ఏంటి?
ఈ పథకం దేశంలోని అన్ని భూస్వామ్య రైతు కుటుంబాలకు వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల పెట్టుబడి, ఆర్థిక అవసరాల కోసం ఆదాయ సహాయాన్ని అందిస్తుంది.
ఈ ‘పీఎం-కిసాన్’ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించామన్నారు. దీనికింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున ఏటా రూ.6,000 ఆర్థికసాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో ఇప్పటిదాకా దేశంలోని 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ.3.04 లక్షల కోట్లకుపైగా లబ్ధి చేకూరిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివారజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. తాజాగా 17వ విడత నిధుల విడుదలతో కలిపి లబ్ధిదారులకు బదిలీ అయిన మొత్తం రూ.3.24 లక్షల కోట్లకు పైగా లెక్క తేలుతుందన్నారు.
డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి..
- PM KISAN 17th instalment : స్టెప్ 1:- అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ని సందర్శించండి. లబ్ధిదారుని స్టేటస్ పేజీకి వెళ్లండి.
- స్టెప్ 2:- “బెనిఫిషియరీ స్టేటస్”పై క్లిక్ చేసి, మీ ఆధార్ నంబర్ లేదా అకౌంట్ నంబర్ ఎంటర్ చేయండి.
- స్టెప్ 3:- "డేటాను పొందండి" అనే ఆప్షనపై క్లిక్ చేయండి, మీరు లబ్ధిదారుని స్టేటస్‌ని చూడగలుగుతారు.
PM kisan samman nidhi latest news : వెబ్సైట్ ప్రకారం… "పీఎం కిసాన్ రిజిస్టర్డ్ రైతులకు ఈకేవైసీ తప్పనిసరి. ఓటీపీతో మేనేజ్ చేసేఈకేవైసీ పీఎం కిసాన్ పోర్టల్‌లో లభ్యం అవుతుంది. లేదా బయోమెట్రిక్ బీఆర్డీ ఈకేవైసీ కోసం సమీప సీఎస్సీ సెంటర్లను సంప్రదించవచ్చు." ఈకేవైసీ మూడు పద్ధతుల్లో అందుబాటులో ఉంది: ఓటీపీ నిర్వచించని ఈ-కెవైసీ, బయోమెట్రిక్ ఆధారిత ఈ-కెవైసీ, ఫేస్ ఆథెంటికేషన్ ఆధారిత ఈ-కెవైసీ.
మరోవైపు.. రైతులకు సాయం చేసేందుకు 50 కేవీకేలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది కేంద్రం. లువురు కేంద్రమంత్రులు ఆయా కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే రైతులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతులు, కొత్త సాంకేతికతలు, వాతావరణ ప్రతికూలతలను తట్టుకోగల వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. అలాగే ‘పీఎం-కిసాన్’ లబ్ధిదారులకు తమ అకౌంట్ స్టేటస్, నిధుల జమను చూసుకోవడం, ‘కిసాన్-ఇమిత్ర చాట్‌బాట్’ వినియోగించే విధానం వంటివి కూడా నేర్పుతారు.