తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Viral : అప్పడాలు ఎలా తయారు చేస్తారో తెలుసా? చూస్తే.. ఇక అస్సలు తినరు!

Viral : అప్పడాలు ఎలా తయారు చేస్తారో తెలుసా? చూస్తే.. ఇక అస్సలు తినరు!

Sharath Chitturi HT Telugu

17 March 2024, 14:23 IST

    • Papad Making Process : అప్పడాలు ఎలా తయారు చేస్తారో తెలుసా? ఈ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ మారింది. వీడియో చూశాక.. మీరు ఇక అప్పడాలు తినడం మానేస్తారేమో!
అప్పడాలు ఎలా తయారు చేస్తారో తెలుసా?
అప్పడాలు ఎలా తయారు చేస్తారో తెలుసా?

అప్పడాలు ఎలా తయారు చేస్తారో తెలుసా?

Papad Making Process viral video : పప్పు అయినా, కూర అయినా, సాంబార్​ అయినా.. పక్కన నంచుకోవడానికి అప్పడాలు లేకపోతే.. ఏదో వెలితిగా ఉంటుంది! ప్రతి భారతీయ కుటుంబాలు.. ఈ విషయాన్ని అంగీకరిస్తాయి. గ్రాసరీ లిస్ట్​లో, పెళ్లిళ్లల్లో, ఈవెంట్స్​లో.. అప్పడాలు లేకపోతే కష్టమే! క్రంచీగా, రుచికరంగా ఉంటే.. ఇక ఒకేసారి 4,5 కూడా నోట్లోకి వెళ్లిపోతాయి కదా! అంతా బాగుంది కానీ.. ఈ అప్పడాలను ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? తయారు చేసే విధానాన్ని ఎప్పుడైనా చూశారా? ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు.. సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. వీడియో చూశాక.. ఇక ఎప్పటికీ అప్పడలు తినకూడదు! అని ఫిక్స్​ అవుతారేమో!

ట్రెండింగ్ వార్తలు

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

అప్పడాలను ఇలా తయారు చేస్తారా..?

దబాకే ఖావ్​ ( @dabake_khao) అనే ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​.. ఈ వీడియోను షేర్​ చేసింది. వీడియోలో తొలుత ఓ మహిళ కనిపించింది. ఆమె అప్పడాలు తయారు చేయడం మొదలుపెట్టింది. తొలుత.. అప్పడాల పిండిని తయారు చేసింది. ఆ తర్వాత ఉడకపెట్టడం మొదలుపెట్టింది. థిన్​ షీట్స్​గా వచ్చేంత వరకు భారీ ప్లేట్​ మీద స్ప్రెడ్​ చేసింది. అవి ఆరిన తర్వాత.. మరో మహిళ, వాటిని నేల మీద పరిచింది. ఆ తర్వాత.. గిన్నె పెట్టి, దాని మీద కాళ్లతో తొక్కడం మొదలుపెట్టింది. ఆ షార్ప్​నెస్​కి థిన్​ షీట్స్​పై మార్క్​లు ఏర్పడ్డాయి. అనంతరం.. వాటిని చిన్న చిన్న సైజుల్లో కట్​ చేసింది. ఇలా.. అప్పడాలు తయారయ్యాయి.

viral video Papad making process : అయితే.. చేతులకు ఏం ధరించకుండా అప్పడాలు చేయడంతో 'హైజీన్​'పై ఆందోళన వ్యక్తం అవుతోంది. మరీ ముఖ్యంగా.. కాళ్లతో తొక్కుతుండటం చూసి నెటిజన్లు షాక్​కు గురవుతున్నారు. గాలికి వాటిని వదిలేయడాన్ని చూసి.. మళ్లీ వాటిని తినాలంటే భయపడుతున్నారు.

ఇదీ చూడండి :- Cockroaches in dosa : ప్లెయిన్​ దోశ ఆర్డర్​ చేస్తే.. ‘బొద్దింకల దోశ’ ఇచ్చారు! కస్టమర్​ షాక్​!

"శుభ్రత లేదు" అని ఒకరు కామెంట్​ చేస్తే.. 'శుభ్రతా! అంటే ఏంటి?' అని ఇంకొకరు సెటైర్​ వేశారు. ఇలా చాలా కామెంట్లు.. హైజీనిటీపైనే ఉన్నాయి. "ఇది పాత కాలం నాటి ప్రాసెస్​. ఈ ప్రాసెస్​ మారాలి," అని ఇంకొకరు చెప్పుకొచ్చారు.

అయితే.. కొందరు మాత్రం పాజిటివ్​గానే కామెంట్స్​ చేస్తున్నారు. "మనం తినే ఫాస్ట్​ ఫుడ్​ కన్నా ఇది బెటర్​" అని ఓ వ్యక్తి రాసుకొచ్చారు. ఇంకొకరు.. "రోడ్డు మీద, ఫాస్ట్​ ఫుడ్​ రెస్టారెంట్స్​తో పోల్చితే ఇది బెటరే. అప్పడాలు చేస్తున్న మహిళ.. దాని మీద డైరక్ట్​గా కాలు వేయలేదు. సంతోషం!" అని కామెంట్​ చేశారు.

మరి మీరేం అంటారు? ఈ అప్పడాల తయారీ ప్రాసెస్​ చూసి మీరెలా ఫీల్​ అయ్యారు?

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన వీడియోను ఇక్కడ చూసేయండి :

తదుపరి వ్యాసం