Cockroaches in dosa : ప్లెయిన్ దోశ ఆర్డర్ చేస్తే.. ‘బొద్దింకల దోశ’ ఇచ్చారు! కస్టమర్ షాక్!
Madras Coffee House Delhi : మద్రాస్ కాఫీ హౌస్ లో ఓ మహిళ తన దోశలో బొద్దింకలను గుర్తించి అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెస్టారెంట్ యజమాని తనను బెదిరించడానికి ప్రయత్నించాడని ఆమె పేర్కొంది.
Cockroaches in Madras Coffee House : దిల్లీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నాట్ ప్లేస్‌లోని మద్రాస్ కాఫీ హౌస్‌లో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆర్డర్ చేసిన ప్లెయిన్ దోశలో ఎనిమిది బొద్దింకలు కనిపించాయి! ఆ బొద్దింకలను చూసి ఆమె షాక్‌కు గురైంది.
ఇదీ జరిగింది..
దిల్లీలో మార్చ్ 7న జరిగింది ఈ ఘటన. దీనిని తాజాగా.. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది ఇషానీ అనే మహిళ. ఆమె.. స్నేహితులతో కలిసి మద్రాస్ కాఫీ హౌస్‌కి వెళ్లింది. సాదా దోశను ఆర్డర్ చేయగా, దానిపై అనేక నల్లటి మచ్చలు కనిపించాయి. ఏంటని చూసే సరికి షాక్ కు గురైంది. దోశలో బొద్దింకలను గుర్తించడానికి ఆమెకు ఎక్కువ సమయం పట్టలేదు.
Delhi Madras Coffee House : బొద్దింక దోశను వీడియో తీయాలని ఇషానీ తన స్నేహితురాలిని కోరింది. కానీ హోటల్ సిబ్బంది మధ్యలోనే వారిని అడ్డుకున్నారు. వారి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి.. ఇషానీ, ఆమె స్నేహితుడు పోలీసులకు ఫోన్ చేసి రెస్టారెంట్ పై ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు వారికి హామీ ఇచ్చారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన బొద్దింకల దోశ వీడియోను ఇక్కడ చూడండి :
రెస్టారెంట్ ఆహారంతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్న ఇషానీ, ఫిర్యాదు కోసం సంబంధిత అధికారులను సంప్రదించానని, అందుకు సాక్ష్యంగా ఆ వీడియోను షేర్ చేశానని తెలిపింది.
Cockroaches in plain dosa viral video : రెస్టారెంట్ యజమాని తన అడ్రెస్ అడగడం ద్వారా తనను భయపెట్టడానికి ప్రయత్నించాడని ఇషానీ రాసింది. రెస్టారెంట్ యజమాని.. హోటల్ లైసెన్స్‌ను కూడా పోలీసుల ముందు చూపించలేదని ఆమె పేర్కొన్నారు.
రెస్టారెంట్ కిచెన్ దయనీయ స్థితిని వివరిస్తూ.. “ప్రతి గంటకు 30 మంది కస్టమర్లతో బిజీబిజీగా ఉండే గురువారం నాడు.. ఇంత పెద్ద పేరున్న రెస్టారెంట్.. ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తుందో నాకు అర్థం కావడం లేదు. వంట గది దారుణంగా ఉంది. అది దుర్వాసన వెదజల్లుతోంది. దానిలో సగం పైకప్పు లేదు. నేను చూసినదానికి నేను అసహ్యించుకున్నాను. నేను ఇక్కడితో ఆగను. సేఫ్టీతో పాటు ఫుడ్ సేఫ్టీ విషయంలో కూడా నాకు అన్ని హక్కులు ఉన్నాయి,” అని ఇషానీ రాసుకొచ్చింది.
"ఒక శాఖాహార రెస్టారెంట్ యజమానులు.. నాకు పరిహారం ఇస్తామని చెప్పారు. వీడియో తీయడం ఆపేయాలని అడిగారు. శాకాహారి అయిన వారు నా ముందు కూర్చుని ఈ బొద్దింకల దోశను తినగలిగితే, నేను ఫిర్యాదు చేయను అని చెప్పాను," అని ఆమె అన్నారు.
ఈ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. వారు రెస్టారెంట్‌ని మూసివేయాలని డిమాండ్ చేశారు.
"ఇది చాలా ఘోరం! వారిని కచ్చితంగా బాధ్యులను చేయాలి!, అని ఒక యూజర్ రాశారు.
"నేను అక్కడ ఆహారాన్ని ప్రయత్నించాలని అనుకున్నాను - ఇది చాలా భయంకరమైనది," అని మరొక యూజర్ రాశారు.
మద్రాస్ కాఫీ హౌస్‌లో ఆపరేషన్స్‌ని నిర్వహిస్తున్న అనుభవ్ నానడా.. ఈ ఘటనపై స్పందిస్తూ.. అసౌకర్యానికి, లోపాలకు క్షమాపణలు చెప్పారు.
సంబంధిత కథనం