Kadai Paneer Recipe : రెస్టారెంట్ స్టైల్ కడాయి పనీర్.. ఇంట్లోనే తయారు చేయెుచ్చు-how to prepare kadai paneer tasty recipe in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kadai Paneer Recipe : రెస్టారెంట్ స్టైల్ కడాయి పనీర్.. ఇంట్లోనే తయారు చేయెుచ్చు

Kadai Paneer Recipe : రెస్టారెంట్ స్టైల్ కడాయి పనీర్.. ఇంట్లోనే తయారు చేయెుచ్చు

Anand Sai HT Telugu Published Jan 16, 2024 03:30 PM IST
Anand Sai HT Telugu
Published Jan 16, 2024 03:30 PM IST

Kadai Paneer Recipe In Telugu : పనీర్ రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది ప్రత్యేకమైన ఆహార పదార్థం. భారీ మొత్తంలో ప్రోటీన్ కంటెంట్ కలిగి ఉంటుంది. శాకాహారులకు పనీర్ అంటే చాలా ఇష్టంగా తింటారు. అయితే రెస్టారెంట్ స్టైల్ కడాయి పనీర్ తయారు చేసి లాగించేయండి.

కడాయి పనీర్
కడాయి పనీర్ (Unsplash)

రెస్టారెంట్లకు వెళితే షాహీ పనీర్, పనీర్ బటర్ మసాలా, పనీర్ టిక్కా, పనీర్ చిల్లీ ఇలా రకరకాల పనీర్ వంటకాలు దొరుకుతాయి. కానీ ఇంట్లో ఉంటే మాత్రం ఒకే రకమైన పనీర్ చేసుకుని తినాలి. హోటళ్లలో దొరికే కడాయి పనీర్ వంటకం చాలా రుచిగా అనిపిస్తుంది. దీన్ని ఇంట్లోనే తయారు చేయడం కూడా చాలా ఈజీ. కేవలం అరగంటలో తయారు చేసేయెుచ్చు. ఈ పనీర్ రెసిపీ గురించి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

పనీర్ అనేది ప్రోటీన్ కంటెంట్‌తో కూడిన ఆహార పదార్థం. పనీర్ ను ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ లోనే కాదు.. చైనీస్ ఫుడ్ ఐటమ్స్ లో కూడా వాడుతారు. ఈ రోజు మనం కడాయి పనీర్ రెసిపీ తయారీ విధానం తెలుసుకుందాం. ఇది కొద్దిగా భిన్నంగా ఉంటుంది. రెస్టారెంట్ టేస్ట్ లాగే ఇంట్లో కడాయి పనీర్ చేసుకోవచ్చు. దీనిని మసాలాలు, క్యాప్సికమ్ ఉపయోగించి స్పైసీగా తయారు చేయవచ్చు.

మసాలా తయారీకి కావలసిన పదార్థాలు

ధనియాల గింజలు - 1 1/2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు, కాశ్మీరీ ఎర్ర మిరపకాయ - 4 నుండి 5, మిరప గింజలు - 1 1/2 టేబుల్ స్పూన్లు, ఉప్పు 1 చెంచా.

కడాయి పనీర్ తయారీకి కావలసిన పదార్థాలు

నూనె 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం 1 అంగుళం, ఉల్లిపాయలు 2 పెద్దవి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 tsp, ఉప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్

పేస్ట్ చేయడానికి

2 పెద్ద టమోటాలు, రుచికి ఉప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఒక మధ్య తరహా ఉల్లిపాయ, క్యాప్సికమ్ 1/2, తరిగిన టమోటా 1, పనీర్ 250 గ్రాములు, కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కడాయి మసాలా పొడి 1 టేబుల్ స్పూన్

కడాయి పనీర్ ఎలా తయారు చేయాలి

ఒక పాత్రలో ధనియాలు, జీలకర్ర, కాశ్మీరీ మిరియాలు, ఎండు మిరియాలు, ఉప్పు వేసి వేయించాలి. పచ్చి వాసన పోయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ కడాయి మసాలా మిక్స్ సిద్ధంగా ఉంది.

ఇప్పుడు మరో పాత్రలో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. దీనికి జీలకర్ర, సన్నగా తురిమిన అల్లం వేసి వేయించాలి. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఈ మిశ్రమంలో పసుపు, కారపు పొడి, ధనియాల పొడి వేయాలి. తరవాత అందులో టొమాటో పేస్ట్ వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కొన్ని నిమిషాలు ఉడికించాలి

మరొక పాత్రలో నెయ్యి లేదా నూనె వేయండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టొమాటో, క్యాప్సికమ్ వేసి కొన్ని నిమిషాలు వేయించాలి. దీనికి పనీర్ ముక్కలు వేసి ముందుగా సిద్ధం చేసుకున్న కడాయి మసాలా పొడి వేసి బాగా కలపాలి. దానితో గ్రేవీ కలపాలి. చివరి దశలో మీకు కావాలంటే క్రీమ్ జోడించవచ్చు. చివరగా కొత్తిమీర ఆకులతో అలంకరించి పనీర్ కడాయిని సర్వ్ చేయవచ్చు. జీరా రైస్, చపాతీ, నాన్ లేదా పరాఠాలతో పనీర్ కడాయి బాగుంటుంది.

Whats_app_banner