తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pakistan Blasts : ఎన్నికల వేళ పాక్‌లో భారీ పేలుళ్లు.. 20 మంది మృతి!

Pakistan Blasts : ఎన్నికల వేళ పాక్‌లో భారీ పేలుళ్లు.. 20 మంది మృతి!

07 February 2024, 16:40 IST

google News
  • Pakistan blasts Updates: పాకిస్థాన్ లో భారీ బాంబు పేలుడు సంభవించింది.  బలూచిస్థాన్  ప్రావిన్స్‌లో ఈ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 

పాకిస్థాన్ లో భారీ పేలుడు
పాకిస్థాన్ లో భారీ పేలుడు (AFP)

పాకిస్థాన్ లో భారీ పేలుడు

Pakistan Blasts : పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రేపు (గురువారం) పోలింగ్ ప్రక్రియ ఉండగా… బుధవారం ఓ పార్టీ కార్యాలయం వద్ద భారీ బాంబు పేలుడు సంభవించింది. రెండు బాంబు పేలుళ్లు జరిగినట్లు పాక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పేలుళ్లలో 20 మందికి పైగా మృతి చెందగా… మరో 20 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ బాంబు దాడులకు ఎవరు బాధ్యత వహిస్తూ ప్రకటన వెల్లడించలేదు.

గ్యాస్-రిచ్ ప్రావిన్స్…. ఆఫ్ఘానిస్తాన్ మరియు ఇరాన్‌లకు సరిహద్దుగా ఉంది, రెండు దశాబ్దాలుగా బలూచ్ జాతీయవాదులు తిరుగుబాటు చేస్తున్నారు. మొదట్లో స్థానిక వనరుల కోసం పోరాటం జరగగా… క్రమేణా ఇది స్వతంత్రం కోసం దారి తీసింది. పాకిస్తాన్ లోని తాలిబాన్ మరియు ఇతర తీవ్రవాద గ్రూపులు కూడా ఈ ప్రాంతంలో గణనీయమైన ఉనికిని కలిగి ఉన్నాయి.

బాంబు దాడికి బాధ్యత వహిస్తూ ఏ గ్రూపు కూడా ప్రకటించలేదు. పిషిన్ జిల్లాలో స్వతంత్ర ఎన్నికల అభ్యర్థి కార్యాలయంలో జరిగిన మొదటి దాడిలో 14 మంది మరణించారు. ఆ తర్వాత ఆఫ్ఘాన్ సరిహద్దుకు సమీపంలోని ఖిల్లా సైఫుల్లాలో మరో పేలుడు జరిగింది. అయితే జమియాత్ ఉలేమా ఇస్లాం (JUI) కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ జరిగిన దాడిలో కనీసం 10 మంది చనిపోయినట్లు సమాచారం.

ఈ పేలుళ్లపై ఎన్నికల సంఘం స్పందించింది. బలూచిస్థాన్ చీఫ్ సెక్రటరీ మరియు ఇన్‌స్పెక్టర్ జనరల్‌ను తక్షణ నివేదికలను ఇవ్వాలని కోరింది. సంఘటనల వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది.

2018 సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా గెలిచారు. ఆ తర్వాత ఆయనపై తిరుగుబాటు మొదలుకావటంతో అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారం నుండి తొలగించబడ్డారు.

గురువారం నాడు ఓటింగ్‌ జరిగే వేళ ఈ బాంబు దాడులు కలకలం సృష్టించాయి. ఇప్పటికే ప్రచారం అధికారికంగా మంగళవారం రాత్రి ముగిసింది. ఓటింగ్ ప్రక్రియ స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 8:00 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:00 గంటలకు ముగుస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం