తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పాక్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుడు.. 24 మంది మృతి, చాలా మందికి గాయాలు

పాక్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుడు.. 24 మంది మృతి, చాలా మందికి గాయాలు

Anand Sai HT Telugu

09 November 2024, 12:58 IST

google News
    • Pakistan Bomb Blast : పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో బాంబు పేలింది. ఈ ఘటనలో 24 మంది వరకు మృతి చెందారు. అనేక మందికి గాయాలు అయ్యాయి.
క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో పేలుడు
క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో పేలుడు

క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో పేలుడు

పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో శనివారం జరిగిన పేలుడులో సుమారు 24 మంది మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో ప్లాట్‌ఫారమ్‌పై నుంచి పెషావర్‌కు వెళ్లేందుకు రైలు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో ఇప్పటి వరకూ 24 మంది మృతి చెందినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగార్తులందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, రెస్క్యూ టీం ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే బాంబు స్క్వాడ్ బృందాలు వచ్చాయి. ప్రమాదంపై దర్యాపు జరుగుతోంది.

క్వెట్టా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) ఆపరేషన్స్ మహ్మద్ బలోచ్ మాట్లాడుతూ.. 'ఈ సంఘటన సూసైట్ బాంబ్ ద్వారా జరిగిందనిపిస్తుంది. అయితే ఇది కచ్చితమని చెప్పలేం. పేలుడు స్వభావాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు జరుగుతోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ చాలా మంది ఉన్నారు.' అని మహ్మద్ చెప్పారు.

సుమారు 100 మంది వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తోందని మహ్మద్ చెప్పారు. బలూచిస్థాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టా నుండి గ్యారీసన్ సిటీ రావల్పిండికి వెళ్లేందుకు ప్రయాణికులు రైలు కోసం ఎదురు చూస్తున్న సమయంలో బాంబు పేలిందని తెలిపారు.

ఇటీవలి కాలంలో పాక్‌లో బాంబు పేలుడు ఘటనలు ఎక్కువైపోయాయి. కొన్ని రోజుల కిందట ఉత్తర వజీరిస్థాన్‌లో పేలుడు ఘటనలో నలుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. కొందరికి గాయాలు అయ్యాయి. అంతేకాదు.. ఓ పాఠశాల దగ్గరలోనూ బాంబు పేలుడుతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

ఈ ఘటనలకు కొన్ని రోజుల కిందట బలూచిస్థాన్‌లోని ఒక పాఠశాల సమీపంలో బాంబు పేలగా.. ఐదుగురు పాఠశాల విద్యార్థులతో సహా ఏడుగురు చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ఇలా అనేగ బాంబు పేలుడు ఘటనలు పాకిస్థాన్‌లో జరుగుతున్నాయి.

తదుపరి వ్యాసం