Warangal : ప్రభుత్వం కీలక ప్రకటన.. రెండో రాజధానిగా వరంగల్.. అందుబాటులోకి విమానాశ్రయం!-minister ponguleti srinivas reddy announces that warangal will be the second capital of telangana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Warangal : ప్రభుత్వం కీలక ప్రకటన.. రెండో రాజధానిగా వరంగల్.. అందుబాటులోకి విమానాశ్రయం!

Warangal : ప్రభుత్వం కీలక ప్రకటన.. రెండో రాజధానిగా వరంగల్.. అందుబాటులోకి విమానాశ్రయం!

Nov 03, 2024, 03:28 PM IST Basani Shiva Kumar
Nov 03, 2024, 03:28 PM , IST

  • Warangal : వరంగల్.. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ. ఇక్కడ రోడ్లు, రైల్వే, ఇతర మౌలిక వసతులు ఉన్నాయి. కాస్త దృష్టిపెడితే.. ఎయిర్‌పోర్ట్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఇలాంటి సిటీపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు.

వరంగల్‌ను తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. వరంగల్‌లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

(1 / 5)

చారిత్రాత్మక వరంగల్ నగర అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని పొంగులేటి తెలిపారు. కాకతీయులు పాలించిన గొప్ప చరిత్ర ఉన్న వరంగల్ నగరాన్ని.. హైదరాబా‌ద్‌కు ధీటుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు.

(2 / 5)

భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు. ఆలయ మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఇక్కడి జలాశయాన్ని తాగునీటి జలాశయంగా మారుస్తామని చెప్పారు. 

(3 / 5)

భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. సర్వే చేయించి నిర్మాణాలను తొలగిస్తామని చెప్పారు. 

(4 / 5)

కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే.. మామునూరు విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్ట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు