తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Beggars Family Event : 20వేల మంది అతిథులు- 40లక్షల ఖర్చు.. ‘బిచ్చగాళ్ల’ ఫ్యామిలీ ఈవెంట్​ హైలైట్స్​ ఇవి!

Beggars family event : 20వేల మంది అతిథులు- 40లక్షల ఖర్చు.. ‘బిచ్చగాళ్ల’ ఫ్యామిలీ ఈవెంట్​ హైలైట్స్​ ఇవి!

Sharath Chitturi HT Telugu

26 November 2024, 7:20 IST

google News
    • పాకిస్థాన్​లో ఓ బిచ్చగాళ్ల కుటుంబం లావిష్​ ఈవెంట్​ని ఆర్గనైజ్​ చేసింది. దాదాపు రూ. 40లక్షలు ఖర్చు చేసి 20వేల మంది అతిథులకు భారీగా భోజనం పెట్టింది. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.
బిచ్చగాళ్ల కుటుంబం గ్రాండ్​ ఈవెంట్​..
బిచ్చగాళ్ల కుటుంబం గ్రాండ్​ ఈవెంట్​.. (Representative Image)

బిచ్చగాళ్ల కుటుంబం గ్రాండ్​ ఈవెంట్​..

పాకిస్థాన్​లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్​​ మీడియాలో వైరల్​గా మారింది! ఓ కుటుంబం ఒక గ్రాండ్​ ఈవెంట్​ని ఏర్పాటు చేసింది. 20వేల మంది అతిథులను పిలిపించి భారీ లంచ్​ మెన్యూతో భోజనం పెట్టింది. దీని కోసం 1.25 కోట్ల పాకిస్థానీ రూపీ (దాదాపు రూ. 40లక్షలు) ఖర్చు అయ్యింది. 'ఇందులో ఏముంది? ఇది సాధారణ విషయమే కదా!' అని అనుకుంటున్నారా? మరి ఈ గ్రాండ్​ ఈవెంట్​ ఆర్గనైజ్​ చేసింది.. 'బిచ్చగాళ్ల' కుటుంబం అయితే, ఇది సాధారణ విషయం ఎలా అవుతుంది?

ఇదీ జరిగింది..

పాకిస్థాన్​ గుజ్రన్​వాలా ప్రాంతంలోని రహ్వాలి రైల్వే స్టేషన్​ వద్ద ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ అమ్మమ్మ మరణించిన 40వ రోజుకు సదరు బిచ్చగాళ్ల కుటుంబం ఒక గ్రాండ్​ ఈవెంట్​ని ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్​కి 20వేల మంది వచ్చారు! వీరిని 2వేల వాహనాల్లో ఈవెంట్​కి తీసుకొచ్చింది. పాకిస్థాన్​ పంజాబ్​ నలుమూలల నుంచి అతిథులను ఈవెంట్​కి తీసుకొచ్చారు.

ఇక్కడ ఏర్పాటు చేసిన లంచ్​ మెన్యూ మరో హైలైట్​! సిరి పాయ, మురబ్బ, నాన్​ మటర్​ గంజ్​, టెండర్​ మటన్​ వంటి ఆహారాలను అతిథులకు ఆఫర్​ చేసింది ఆ బిచ్చగాళ్ల కుటుంబం. దీని కోసం 250 మేకలను చంపాల్సి వచ్చిందట.

ఆ తర్వాత అనేక రకాల స్వీట్లతో ఈవెంట్​ని ముగించారు!

ఈవెంట్​కి సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అతిథులు గుంపులుగా కూర్చుని భోజనం తినడం ఇందులో చూడొచ్చు. వంట తయారీ దృశ్యాలు కూడా ఉన్నాయి.

ఈ వీడియో సోషల్​ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. బిచ్చగాళ్ల కుటుంబం 20వేల మందికి భోజనం పెట్టి, 1.25 కోట్ల పాకిస్థానీ రూపీని ఖర్చు చేసిందా? అని కొందరు ఆశ్చర్యపోతుంటే.. 'ఫండింగ్​ ఎవరిది?' అని ఇంకొందరు ప్రశ్నలు వేస్తున్నారు.

ఇతరులు మాత్రం.. 'మిడిల్​ క్లాస్​ కన్నా బిచ్చగాళ్ల కుటుంబాలే బాగున్నాయి," అని అభిప్రాయపడుతున్నారు.

"పాకిస్థాన్​ టాప్​ బిజినెస్​మెన్​లో బిచ్చగాళ్లు కూడా ఉన్నారు," అని ఒకరు అంటే.. "సాధారణ ప్రజల కన్నా బెగ్గర్స్​ చాలా రిచ్​. నేను లైవ్​లో చూశాను," అని ఇంకొకరు అన్నారు.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి..

మరి దీని మీద ఒపీనియన్​ ఏంటి?

తదుపరి వ్యాసం