Bihar caste survey : బిహార్ కుల గణన డేటా విడుదల.. జనాభాలో 63శాతం మంది వారే!
02 October 2023, 14:25 IST
Bihar caste survey : బిహార్ కుల గణనకు సంబంధించిన డేటా విడుదలైంది. రాష్ట్ర జనాభాలోని 63శాతం మంది ఓబీసీలు, ఈబీసీలు ఉన్నట్టు డేటా చెబుతోంది.
బీహార్ కుల గణన డేటా విడుదల.. జనాభాలో 63శాతం మంది వారే!
Bihar caste survey : దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన బిహార్ కుల గణనకు సంబంధించి.. మరో కీలక వార్త! కుల గణన డేటాను తాజాగా ప్రకటించింది నితీశ్ కుమార్ ప్రభుత్వం. రాష్ట్ర జనాభాలో 63శాతం మంది ఓబీసీలు- ఈబీసీలే ఉన్నారని సర్వేలో తేలింది.
బిహార్ జనాభా సుమారు 13.07 కోట్లు! ఈ జనాభాలో ఈబీసీ (అత్యంత వెనకబడిన వర్గాలు) వాటా 36శాతం. ఓబీసీల వాటా 27.13శాతం. 19.7శాతం మంది ఎస్సీలు 1.7శాతం మంది ఎస్టీలు ఉన్నారు.
ఇక బిహార్ జనాభాలో యాదవులు అత్యధికం! బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా ఈ ఓబీసీ వర్గానికి చెందిన వారే. రాష్ట్రంలో యాదవుల వాటా 14.27శాతంగా ఉంది.
Bihar caste survey latest news : కుల గణన డేటా విడుదలకు ముందు పలు కీలక వ్యాఖ్యలు చేశారు బిహార్ సీఎం నితీశ్ కుమార్. రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న 9 పార్టీలతో చర్చలు ప్రారంభిస్తామని, సర్వే తర్వాత ఏం చేయాలి? అన్న విషయంపై సమాలోచన చేస్తామని అన్నారు.
రాష్ట్రంలో ఓబీసీ కోటా ప్రస్తుతం 27శాతంగా ఉంది. దీనిని మరింత పెంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న సమావేశంలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది.
సర్వే ఇలా జరిగింది..
2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. బిహార్ కుల గణన డేటా విడుదలవ్వడం ప్రాముఖ్యత సంతరించుకుంది. తొలి దశ సర్వేలో భాగంగా.. ఇళ్లను మార్క్ చేయడం, ఇంట్లోని కుటుంబసభ్యుల పేర్లను, ఇంటి పెద్ద వివరాలను నమోదు చేయడం జరిగింది. రెండో దశలో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చెందిన సామాజిక, ఆర్థిక విషయాలను నమోదు చేశారు.
Bihar caste survey data : మొత్తం మీద 2.64లక్షల మంది సిబ్బంది.. బిహార్‌లో ఇంటింటికీ వెళ్లి కుల గణనను నిర్వహించారు. ఉద్యోగం, విద్య, మారిటల్ స్టేటస్, భూమి ఉందా? లేదా? ఆస్థులు, కులం వంటి వివరాలను సేకరించారు.
తాము చెపట్టే కుల గణనలో ఎస్సీ, ఎస్టీలను మాత్రమే లెక్కిస్తామని కేంద్రం చెప్పడంతో.. సొంతంగా జనాభా లెక్కలు చేపట్టాలని నితీశ్ కుమార్ ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ సర్వే ఆగస్ట్‌లో ముగిసింది. ఈ కుల గణనతో అందరికి ప్రయోజనం ఉంటుందని ఓ సందర్భంగా వ్యాఖ్యానించారు నితీశ్ కుమార్. బలహీన వర్గాలను కలుపుకుని, ప్రగతివైపు నడవొచ్చని అభిప్రాయపడ్డారు.
Bihar caste survey news : అయితే కులాల ఆధారంగా జనాభాను లెక్కించడం అనే విషయంపై మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇందుకు కొందరు మద్దతిస్తుంటే.. ఇంకొందరు వ్యతిరేకిస్తున్నారు. నితీశ్ కుమార్ మాత్రం.. ఈ తరహా జన గణన చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు పిలుపునిస్తారు.