Caste census : కుల గణనపై కేంద్రం కీలక వ్యాఖ్యలు.. బిహార్ ప్రభుత్వానికి షాక్!
Caste census : జనాభా లెక్కలు నిర్వహించే అధికారం తమకు మాత్రమే ఉందని, మరే ఇతర వ్యవస్థకు లేదని సుప్రీంకోర్టుకు వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. బిహార్ కుల గణన వ్యవహారం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.
Caste census in India : దేశంలో చర్చనీయాంశంగా మారిన కుల గణనపై కీలక వ్యాఖ్యలు చేసింది కేంద్ర ప్రభుత్వం. జనాభాను లెక్కించే ప్రక్రియను.. కేంద్రం తప్ప మరే ఇతర వ్యవస్థ కూడా చేపట్టకూడదని, చేపట్టలేదని స్పష్టం చేసింది. 1948 జనగణన చట్టం కూడా ఇదే చెబుతోందని తేల్చిచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది.
ట్రెండింగ్ వార్తలు
బిహార్ ప్రభుత్వానికి షాక్..!
సుప్రీంకోర్టు ఎదుట కేంద్రం తాజాగా చేసిన వ్యాఖ్యలతో బిహార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది! బిహార్‌లో కులగణన చేపట్టాలని నితీశ్ కుమార్ ప్రభుత్వం గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో.. కులగణనకు సంబంధించి ఆగస్ట్ 6న ఓ సర్వే చేపట్టింది. ఇదే విషయాన్ని గత విచారణలో అత్యున్నత న్యాయస్థానానికి వెల్లడించింది బిహార్ ప్రభుత్వం.
Bihar caste census : కానీ జనాభా లెక్కలను తాము మాత్రమే చేపట్టాలని కేంద్రం చేసిన వ్యాఖ్యలు తాజాగా చర్చలకు దారితీసింది.
"ఎస్సీ,ఎస్టీ, ఓబీసీల అభ్యున్నతికి కావాల్సిన చర్యలు చేపట్టేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. రాజ్యాంగం సూచించిన దానిలో, చట్టాలను అనుసరించి కేంద్రం చర్యలు చేపడుతుంది. కానీ కులగణనతో పాటు జనాభా లెక్కలను నిర్వహించే అధికారం ఒక్క కేంద్రానికే ఉంది," అని అఫిడవిట్లో పేర్కొందని తెలుస్తోంది.
కులగణన నిర్వహించాలని బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకించారు. ఈ మేరకు పట్నా హైకోర్టుకు వెళ్లారు. కానీ వారికి అక్కడ చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వం.. కులగణన చేపట్టవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో.. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
Centre on caste census : "జనగణనను నిర్వహించే హక్కు కేవలం కేంద్రానికే ఉందని రాజ్యాంగంలో ఉంది. కానీ ప్రస్తుతం.. ఒక్క గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసి, కేంద్రం వద్ద ఉన్న అధికారాలను లాగేసుకోవాలని బిహార్ ప్రభుత్వం చూస్తోంది," అని పిటిషనర్లు పేర్కొన్నారు.
ఆయా పిటిషన్లపై విచారణ జరుపుతూ వస్తోంది సర్వోన్నత న్యాయస్థానం. తాజాగా.. వీటిపై తమ సమాధానంగా అఫిడవిట్‌ను దాఖలు చేసింది కేంద్రం.
caste census in Bihar : మరోవైపు.. బిహార్‌లోని 12.70కోట్ల మంది జనాభాకు కులగణన జరపాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. 38 జిల్లాల్లో మొత్తం మీద 2.58కోట్ల నివాసాలు.. ఈ కులగణనలో పాల్గొనాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం