NEET 2023 exam date : 2023 నీట్ పరీక్ష తేదీని ప్రకటించిన ఎన్టీఏ.. ఎప్పుడంటే!
16 December 2022, 8:47 IST
- NEET 2023 exam date : 2023 నీట్ పరీక్షను సంబంధించిన కీలక విషయాన్ని ప్రకటించింది ఎన్టీఏ. మే 7న నీట్ పరీక్ష జరుగుతుందని పేర్కొంది.
నీట్ పరీక్ష తేదీ ఇదే..
NEET 2023 exam date : 2023 నీట్(నేషనల్ ఎలిజబులిటీ ఎంట్రెన్స్ టెస్ట్) యూజీ పరీక్ష తేదీని ప్రకటించింది ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ). లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. 2023 నీట్ పరీక్ష మే 7న జరగనుంది. పెన్ అండ్ పేపర్ మోడ్‌లో ఈసారి నీట్ యూజీ పరీక్ష జరగనుంది. ఎగ్జామ్ రాసేందుకు అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని ఎన్టీఏ ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతానికి 2023 నీట్ ఎగ్జామ్ డేట్‌ను మాత్రమే ప్రకటించింది.
2023 నీట్లో భాగంగా.. 91,827 ఎంబీబీఎస్, 698 బీడీఎస్, 52,720 ఆయుష్, 487 బీఎస్సీ నర్సింగ్, 603 బీవీఎస్సీ సీట్లను భర్తీ చేస్తారు. ఎయిమ్స్‌లోని 1899 ఎంబీబీఎస్, జిప్మేర్కు చెందిన 249 ఎంబీబీఎస్ సీట్ల కోసం కూడా నీట్ పరీక్షను నిర్వహిస్తారు.
NEET 2023 registration : మెడికల్, డెంటల్, నర్సింగ్, ఆయుష్ అడ్మిషన్ల కోసం నీట్ పరీక్షను నిర్వహిస్తుంది ఎన్టీఏ. అయితే.. 2023 నీట్‌ను రెండుసార్లు నిర్వహించే విషయంపై ఎన్టీఏ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
2018లో మే 6న జరిగిన నీట్ పరీక్ష కోసం 13,26,725 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2019లో మే 5న జరిగిన పరీక్ష కోసం 15,19,375 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2020లో సెప్టెంబర్ 13న జరిగిన పరీక్ష కోసం 15,97,435 మంది రిజిస్టర్ అయ్యారు. ఇక 2021 సెప్టెంబర్ 12న జరిగిన నీట్ కోసం 16,14,777మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2022లో జులై 17న నీట్ పరీక్ష జరిగింది. ఈసారి ఏకంగా 18,72,343 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
NEET 2023 latest news : ఈ క్రమంలో నీట్ రిజిస్ట్రేషన్, లాస్ట్ డేట్, కరెక్షన్, అలాట్మెంట్, అడ్మిట్ కార్డ్, ఫలితాలు, కౌన్సిలింగ్ వంటి వివరాలను ఎన్టీఏ ఇంకా ప్రకటించాల్సి ఉంది. మరిన్ని వివరాల కోసం nta.nic.in లేదా neet.nta.nic.in వెబ్‌సైట్స్‌లను అభ్యర్థులు ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాల్సి ఉంటుంది.
జేఈఈ మెయిన్ ఎగ్జామ్..
JEE Main Exam 2023 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం 2023 సంవత్సరం జేఈఈ మెయిన్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.డిసెంబర్ 15 నుంచే ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 12, 2023. అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in లో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.