JEE Main Exam 2023: జేఈఈ మెయిన్2023 రిజిస్ట్రేషన్ ప్రారంభం;లాస్ట్ డేట్ ఎప్పుడంటే
JEE Main Exam 2023: జేఈఈ మెయిన్ ఎగ్జామ్ 2023 నోటిఫికేషన్ విడుదల అయింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
JEE Main Exam 2023: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(National Testing Agency -NTA) గురువారం 2023 సంవత్సరం జేఈఈ మెయిన్ ఎగ్జామ్(JEE Main Exam 2023) నోటిఫికేషన్ ను విడుదల చేసింది.డిసెంబర్ 15 నుంచే ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 12, 2023. అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in లో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
JEE Main fee payment: ఫీ చెల్లింపు ఎలా?
2023 జనవరి 12 వరకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ల ద్వారా విద్యార్థులు ఫీజును చెల్లించవచ్చు. పరీక్ష కేంద్రం వివరాలను జనవరి రెండో వారంలో ఎన్ టీ ఏ (NTA) ప్రకటిస్తుంది. అలాగే, జనవరి మూడో వారంలో ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
JEE Main exams: పరీక్షలు ఎప్పుడు?
జేఈఈ మెయిన్ పరీక్ష(JEE (Main) examination- 2023) వ చ్చే సంవత్సరం జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీలలో జరుగుతుంది. అలాగే, మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మళయాలం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ భాషల్లో నుంచి విద్యార్థులు తాము పరీక్ష రాయాలనుకునే భాషను ఎంపిక చేసుకోవచ్చు. రెండు సెషన్స్ లో ఈ పరీక్ష జరుగుతుంది. సెషన్ 1 జనవరి 2023లో, సెషన్ 2 ఏప్రిల్ 2023లో జరుగుతుంది. పైన పేర్కొన్న తేదీలు సెషన్ 1 కు సంబంధించినవి. సెషన్ 1 ను ఎంపిక చేసుకున్నవారికి మాత్రమే ప్రస్తుత రిజిస్ట్రేషన్ వర్తిస్తుంది. సెషన్ 2 కి సంబంధించిన విండో త్వరలో విడుదల అవుతుంది.
టాపిక్