తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cuet Ug 2024 Results : సీయూఈటీ యూజీ 2024 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి.. డైరెక్ట్ లింక్

CUET UG 2024 Results : సీయూఈటీ యూజీ 2024 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి.. డైరెక్ట్ లింక్

Anand Sai HT Telugu

28 July 2024, 21:07 IST

google News
    • CUET UG Results : సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సీయూఈటీ యూజీ 2024 పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) జులై 28న విడుదల చేసింది.
సీయూఈటీ యూజీ 2024 ఫలితాలు విడుదల
సీయూఈటీ యూజీ 2024 ఫలితాలు విడుదల (Unsplash)

సీయూఈటీ యూజీ 2024 ఫలితాలు విడుదల

కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ లేదా CUET UG 2024 ఫలితాలు జులై 28న ప్రకటించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌ని అధికారిక వెబ్‌సైట్ exams.nta.ac.in/CUET నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేయడానికి, అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.

రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి

అధికారిక వెబ్‌సైట్, exams.nta.ac.in/CUET-UGని సందర్శించండి

హోమ్ పేజీలో CUET UG స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి

మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి.

CUET UG ఫలితాన్ని సమర్పించి, తనిఖీ చేయండి.

స్కోర్‌కార్డ్ ప్రింటవుట్ తీసుకోండి.

NEET UG, NTAకి సంబంధించిన ఇతర కీలకమైన ప్రవేశ పరీక్షల వివాదం కారణంగా CUET UG ఫలితాల ప్రకటన ఆలస్యమైంది. NTA దాని అధికారిక పత్రికా ప్రకటనలో 'అభ్యర్థుల ఫలితాలను విశ్వవిద్యాలయాలతో పంచుకునే ప్రక్రియలో ఉంది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం సంబంధిత విశ్వవిద్యాలయాలు, సంస్థలతో సంప్రదించాలి.' అని సూచించారు.

ఈసారి హైబ్రిడ్ పద్ధతిలో

మే 15 నుంచి జూన్ 29 వరకూ 13 భాషల్లో సీయూఈటీ యూజీ పరీక్షలు నిర్వహించారు. దేశంలోని 379 నగరాల్లో, విదేశాల్లో 26 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. మెుత్తం 13.48 లక్షల మంది హాజరు అయ్యారు. ఈసారి హైబ్రిడ్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించారు. అంటే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అన్నమాట. 15 సబ్జెక్టులకు ఆఫ్‌లైన్ విధానంలో, మిగతా సబ్జెక్టులకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు ఏర్పాటు చేశారు. సీయూఈటీ యూజీ ప్రాథమిక కీ జులై 7న విడుదల చేయగా.. జులై 9 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. ఇక జులై 25న తుది ఆన్సర్ కీని ఎన్టీఏ విడుదల చేసి.. తాజాగా రిజల్ట్ అనౌన్స్ చేశారు.

యూనివర్సిటీల్లో సీట్

ఈ ప్రవేశ పరీక్ష స్కోరు ఆధారంగా దేశంలోని కేంద్రీయ వర్సిటీలతోపాటుగా ప్రవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు సైతం ప్రవేశలు ఇస్తాయి. ఇందులో 12 రాష్ట్రా యూనివర్సిటీలు, 11 డీమ్డ్, 19 ప్రైవేట్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందుతారు. మెుత్తంగా 99 యూనివర్సిటీల్లో ప్రవేశాలు ఉండనున్నాయి. 13 భాషల్లో పరీక్ష నిర్వహించారు. అయితే అభ్యర్థులు ఏదైనా ఒక లాంగ్వేజ్‌ పరీక్షను కచ్చితంగా రాయాలి. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ, ఉర్దూ, పంజాబీ, బెంగాళీ, గుజరాతి, మరాఠీ, అస్సామీ, ఒరియా, ఇంగ్లిష్‌లలో ఏదైనా ఒక లాంగ్వేజ్ ఎంపిక చేసుకోవచ్చు.

యూజీ పరీక్ష మూడు సెక్షన్లుగా నిర్వహిస్తారు. మెుదటి సెక్షన్ లాంగ్వేజ్, రెండో సెక్షన్ ప్రత్యేకంగా సబ్జెక్ట్, మూడో సెక్షన్ జనరల్ టెస్ట్‌లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతీ ప్రశ్నకు 5 మార్కులు ఉండగా.. తప్పు జవాబుకు ఒక మార్క్ తగ్గిస్తారు. ఇక్కడ వచ్చిన స్కోరు ఆధారంగా ప్రముఖ కేంద్రియ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందుతారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కోసం సీయూఈటీ యూజీ మార్కులు అవసరం.

తదుపరి వ్యాసం