తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  North Korea: ఉత్తర కొరియాలో తీవ్ర ఆహార సంక్షోభం.. వేలాది మందికి ముప్పు! కారణాలివే

North Korea: ఉత్తర కొరియాలో తీవ్ర ఆహార సంక్షోభం.. వేలాది మందికి ముప్పు! కారణాలివే

05 March 2023, 9:07 IST

    • North Korea Food shortage: ఉత్తర కొరియాలో తీవ్ర ఆహార కొరత ఏర్పడిందని రిపోర్టులు బయటికి వస్తున్నాయి. దీంతో ఆ దేశంలో ఆకలి మరణాలు నమోదయ్యే అవకాశం ఉందన్న ఆందోళనను నిపుణులు వెల్లడిస్తున్నారు.
North Korea Food shortage: కిమా జాంగ్ ఉన్ (Photo: Reuters)
North Korea Food shortage: కిమా జాంగ్ ఉన్ (Photo: Reuters)

North Korea Food shortage: కిమా జాంగ్ ఉన్ (Photo: Reuters)

North Korea Food shortage: నియంత కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un) పాలిస్తున్న ఉత్తర కొరియా.. తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్న సమాచారం బయటికి వచ్చింది. ఆ దేశంలో ప్రజలకు తిండి దొరకడమే కష్టంగా మారిందట. జనాలు ఆకలి తీర్చుకునేందుకు కావాల్సిన కనీస ఆహారం కూడా ఆ దేశంలో దొరకడం లేదని, ఆహార సరఫరా చాలా తక్కువగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉత్తర కొరియాలో ఆకలి చావులు నమోదయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

North Korea Food shortage: 1990 దశకంలో లాంటి అత్యంత దారుణమైన కరువు, ఆహార కొరత పరిస్థితులను ప్రస్తుతం ఉత్తర కొరియా ఎదుర్కొంటోందని నిపుణలు వెల్లడించారు. 1990 దశకంలో కఠినమైన సమయంగా చెప్పుకునే ఆ కాలంలో ఆకలి కారణంగా లక్షలాది మంది ఉత్తర కొరియాలో చనిపోయారు. మొత్తం జనాభాలో 3 శాతం మంది వరకు అప్పట్లో మరణించారు. ప్రస్తుతం కూడా కరువు ఆ దేశంలో ఆహార కొరత ఆ స్థాయిలో ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆహార సంక్షోభం ఎలా ఉంది?

North Korea Food shortage: ట్రేడ్ డేటా, శాటిలైట్ ఇమేజ్‍లు, ఐక్యరాజ్య సమితి, దక్షిణ కొరియా అధికార వర్గాల అంచాలను బట్టి ఉత్తర కొరియాలో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తినట్టు వెల్లడవుతోంది. ప్రజల ఆకలిని తీర్చేందుకు కావాల్సిన కనీస అవసరాల కంటే తక్కువ ఆహారం ప్రస్తుతం ఆ దేశంలో ఉందని తెలుస్తోంది. తీవ్రమైన ఆహార కొరత ఏర్పడిందని సమాచారం. ఈ విషయాన్ని పీటర్సన్ ఇన్‍స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్ రీసెర్చ్ అనలిస్ట్ లుకాస్ రెంగిఫో కెల్లర్.. సీఎన్ఎన్‍తో చెప్పారు.

ఉత్తర కొరియాలో ఆహారం విషయంలో ఉన్నత వర్గాలకు మిలటరీకి ప్రాధాన్యత ఉంటుందని కెల్లర్ చెప్పారు. ఇప్పటికే ఉత్తర కొరియాలో ఆకలి వల్ల మరణాలు సంభవిస్తున్నాయని దక్షిణ కొరియా భావిస్తోంది.

ఆహార సంక్షోభానికి కారణాలేంటి?

North Korea Food shortage: కొవిడ్-19 మహమ్మారికి ముందే ఉత్తర కొరియాలో సగం మంది పోషకాహార లోపంతో ఉన్నారని యూఎన్ ఫుడ్, అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంచనా వేసింది. అయితే కొవిడ్-19 రాక తర్వాత ఆ దేశంలో పరిస్థితులు మరింత దిగజారాయి. మూడేళ్లుగా ఆ దేశం సరిహద్దులను పూర్తిగా మూసేసింది. కొద్దిపాటి దిగుమతులు కూడా నిలిచిపోయాయి. వేరే దేశాలతో వ్యాపారాన్ని పూర్తిగా ఆపేసింది ఉత్తర కొరియా. దీంతో వ్యవసాయం కూడా ఆ దేశంలో గణనీయంగా తగ్గిపోయిందని నిపుణులు చెబుతున్నారు. పంటల సాగు పడిపోయిందని వెల్లడించారు. అలాగే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. ఆహార సంక్షోభంపై కాకుండా క్షిపణుల ప్రయోగాలపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కూడా పరిస్థితి తీవ్రంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలోనూ ఆయుధాలు, క్షిపణుల ప్రయోగాలకే ఆ దేశం ఎక్కువగా ఖర్చు చేసిందని అంటున్నారు. కిమ్ ఒంటెద్దు పోకడలతో ఉత్తర కొరియాలో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.