Video: ప్రజల ముందుకు కిమ్ కూతురు! ఎలా ఉందో చూడండి!-north korean leader kim jon un daughter in a rare public appearance ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  North Korean Leader Kim Jon Un Daughter In A Rare Public Appearance

Video: ప్రజల ముందుకు కిమ్ కూతురు! ఎలా ఉందో చూడండి!

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 19, 2023 10:12 PM IST

Kim Jong Un Daughter: తన కూతురిని ప్రజల ముందుకు తీసుకొచ్చారు ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ దేశ అధికారిక మీడియా విడుదల చేసింది.

Video: ప్రజల ముందుకు కిమ్ కూతురు! ఎలా ఉందో చూడండి!
Video: ప్రజల ముందుకు కిమ్ కూతురు! ఎలా ఉందో చూడండి! (AFP)

Kim Jong Un Daughter: ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‍కు సంబంధించిన వివరాలు బయటి ప్రపంచానికి చాలా తక్కువగా తెలుస్తాయి. ఆయన కుటుంబం గురించి ఎక్కువ మందికి తెలియదు. అయితే, తన కూతురిని తాజాగా ప్రజల ముందుకు తీసుకొచ్చారు కిమ్ జాంగ్ ఉన్. ఓ ఫుట్‍బాల్ మ్యాచ్‍కు కూతురితో కలిసి వచ్చారు కిమ్. క్యాబినెట్ సిబ్బంది, జాతీయ రక్షణ మంత్రిత్వశాఖ సిబ్బంది మధ్య ఈ మ్యాచ్ జరిగిందని రాయిటర్స్ పేర్కొంది. కిమ్ కూతురి పేరు జు ఎఈ (Ju Ae). ఆమె వయసు సుమారు 10 సంవత్సరాలు ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

తర్వాత ఆమెకే పగ్గాలు

Kim Jong Un Daughter: తన తర్వాత ఉత్తర కొరియా పాలనను తన కూతురికే అప్పగించాలని కిమ్ అనుకుంటున్నారన్న వాదనలు ఉన్నాయి. చిన్నతనం నుంచే ఇందుకోసం ‘జు ఎఈ’ని ఆయన సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ తరుణంలో కూతురిని ప్రజల ముందుకు ఆయన తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. కిమ్, ఆయన కూతురు మ్యాచ్ చూస్తూ చప్పట్లు కొట్టారు. కిమ్ జాంగ్ ఉన్.. తండ్రి కిమ్ జాంగ్ ఇల్ (Kim Jong-il) 81వ జయంతి సందర్భంగా నిర్వహించిన షైనింగ్ స్టార్ డే కార్యక్రమాల్లో భాగంగా ఈ ఫుట్‍బాల్ మ్యాచ్ జరిగింది.

అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరిక

North Korea Missile Test: అమెరికా, దక్షిణ కొరియాకు హెచ్చరికగా ఖండాంతర బల్లాస్టిక్ మిసైల్‍ ‘హ్వాసోంగ్-15’ (Hwasong-15) ను ఉత్తర కొరియా తాజాగా పరీక్షించింది. భీకర దాడులు చేయగల అణు సామర్థ్యాన్ని ప్రకటించుకునేందుకు ఈ డ్రిల్ చేసినట్టు ఉత్తర కొరియా ప్రకటించింది. అమెరికా, దక్షిణ కొరియాకు హెచ్చరికగా ఉత్తర కొరియా ఈ టెస్టు చేసింది.

ఈ ఖండాతర బల్లాస్టిక్ మిసైల్‍ను గుర్తించినట్టు దక్షిణ కొరియా కూడా ప్రకటించింది. కాగా, తమ దేశ గగనతలంలోకి ప్రవేశించి.. ఈ మిసైల్ కూలిపోయిందని జపాన్ ప్రకటించింది. నేరుగా ఉత్తర కొరియా నుంచి అమెరికాను టార్గెట్ చేసే సామర్థ్యం ఈ క్షిపణికి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేయనున్నట్టు ప్రకటించడంతో ఉత్తర కొరియా ఈ చర్య చేపట్టింది. ఆ రెండు దేశాలను హెచ్చరించేందుకు ఈ అణ్వాయుధ సామర్థ్యమున్న బల్లాస్టిక్ మిసైల్ టెస్ట్ చేసిందని సమాచారం.

IPL_Entry_Point