తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kim Jong Un | హాలీవుడ్​ సినిమా రేంజ్​లో.. మిస్సైల్​ లాంచ్​!

Kim Jong Un | హాలీవుడ్​ సినిమా రేంజ్​లో.. మిస్సైల్​ లాంచ్​!

HT Telugu Desk HT Telugu

25 March 2022, 20:36 IST

    • ఇటీవలే లాంచ్​ చేసిన రాకాసి మిసైల్​కు సంబంధించిన వీడియోను ఉత్తరకొరియా విడుదల చేసింది. కాగా అది హాలీవుడ్​ సినిమా రేంజ్​లో ఉండటం గమనార్హం.
క్షిపణి ప్రయోగం వేళ అధికారులతో కిమ్​..
క్షిపణి ప్రయోగం వేళ అధికారులతో కిమ్​.. (AFP)

క్షిపణి ప్రయోగం వేళ అధికారులతో కిమ్​..

Kim missile launch | ఉత్తరకొరియా.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది క్షిపణుల ప్రయోగం. కొత్తకొత్త మిస్సైళ్లను లాంచ్​ చేయడం.. ప్రపంచ దేశాలను భయపెట్టడం.. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​కు సర్వ సాధారణమైన విషయం. దేశంలో తిండి తినేందుకు ప్రజలు అల్లాడిపోతున్నా పట్టించుకోకుండా.. 'భద్రత' పేరుతో నిత్యం ఏదో ఒక క్షిపణిని ప్రయోగిస్తుంటారు కిమ్​. కాగా.. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఉత్తరకొరియా ఇటీవలే​ ప్రయోగించిన ఐసీబీఎమ్​(ఇంటర్​కాంటినెంటల్​ బాలిస్టిక్​ మిసైల్​) వార్తల్లో నిలిచింది. తాజాగా లాంచ్​కి సంబంధించిన దృశ్యాలను ఉత్తరకొరియా విడుదల చేసింది. అది హాలీవుడ్​ సినిమా రేంజ్​లో ఉండటం గమనార్హం!

ట్రెండింగ్ వార్తలు

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

లేథర్​ జాకెట్​, సన్​గ్లాసులు ధరించి కిమ్​.. అధికారులతో కలిసి బయటకు రావడం వీడియోలో కనిపిస్తుంది. ఆయన స్టైలిష్​ లుక్​ ఇచ్చినట్టే చెప్పుకోవాలి. తర్వాత.. ఐసీబీఎమ్​ను వీడియోలో చూపించారు. దాని వెనక.. మంచి బ్యాగ్​గ్రౌండ్​ మ్యూజిక్​ను కూడా వినియోగించారు. ఇక మిసైల్​ లాంచ్​ సమయంలో కిమ్​ ఓకే చెబుతున్న దృశ్యాలను స్లో మోషన్​ ఎఫెక్ట్​లో చూపించారు. చివరికి క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్టు కనిపించింది.

ఇలా హాలీవుడ్​ సినిమా రేంజ్​లో మిసైల్​ లాంచ్​ను ఉత్తరకొరియా చూపించడం.. చాలా అరుదు. దేశ ఆయుధ సంపత్తిపై కిమ్​కు ఉన్న నమ్మకాన్ని ఈ దృశ్యాలు ప్రతిబింబిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. 'కిమ్​కు నమ్మకం చాలా పెరిగిపోయింది. ఎంతలా అంటే.. వాటి మీద సినిమాలు తీసుకుని, చూసి ఎంజాయ్​ చేసేంత!' అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అగ్రదేశాలకు సవాలు విసిరేందుకే ఉత్తరకొరియా ఈ వీడియోను విడుదల చేసిందని అంటున్నారు.

రాకాసి మిసైల్​..!

ఉత్తరకొరియా ఇటీవలే ప్రయోగించిన ఐసీబీఎమ్​కు 'రాకాసి మిసైల్​' అనే పేరు కూడా ఉంది. దీనిని ఎంతో శక్తివంతమైన ఆయుధంగా చెబుతుంటారు. 2020లో తొలిసారిగా ఉత్తరకొరియా ఈ మిసైల్​ను ప్రపంచానికి చూపించి, పరిచయం చేసింది. కాగా ఇటీవలే ప్రయోగించింది. ఆ వెంటనే కిమ్​పై ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. ఎన్ని ఆంక్షలు విధించినా లాభం లేదని ఆందోళన వ్యక్తం చేశాయి.

తదుపరి వ్యాసం